లాలూ, మధుకోడా తర్వాత జగనే..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవాద క్యాంప్ చాలా బిజీగా ఉంది. వచ్చే శుక్రవారం.. కోర్టుకు హాజరవ్వాలా..? అవ్వకపోతే.. కోర్టుకు ఏం చెప్పాలన్నదానిపై.. పాత కేసులు.. ఢిల్లీ స్థాయి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు హైకోర్టులో.. పిటిషన్ వేసే ‌అవకాశం లేదు. ఎందుకంటే.. గతంలో పాదయాత్రకు వెళ్తున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను సీబీఐ కోర్టుకొట్టి వేసింది. అప్పుడు ఆయన హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా కొట్టివేసింది. మొన్నటి విచారణలో… దీన్ని గుర్తు చేసిన సీబీఐ కోర్టు.. నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది.

అయితే ఇప్పటి వరకూ.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా.. జగన్ న్యాయవాదులు చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ జగన్ కోర్టుకు హాజరయితే.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. కోర్టుకు నిందితుడిగా హాజరబోతున్న మూడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు . మొదటి స్థానం ప్రస్తుతం జైల్లో ఉన్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ది కాగా.. రెండో స్థానం జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాది. వాళ్లిద్దరూ.. సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి జైలుకెళ్లారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సీఎం కూడా.. జగన్ లాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. చరిత్రలో తొలిసారిగా అవినీతి, ఆరోపణలతో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో ఒక ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. నైతికంగా.. ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు హాజరు కావడం కరెక్ట్ కాదన్న వాదన ఉంది. ముఖ్యమంత్రి స్థానాన్ని అపవిత్రం చేశారన్న విమర్శలు కూడా వస్తాయి. దాంతో జగన్ .. శుక్రవారం ఏం చేయబోతున్నారన్న చర్చ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close