పార్టీలోనే ఉన్నా… ప‌ట్టించుకొండి అంటున్న రేణుకా చౌద‌రి!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీనియ‌ర్ల అల‌క‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది! ఇన్నాళ్లూ లోలోప‌ల మ‌థ‌న‌ప‌డ్డ సీనియ‌ర్లంతా ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌ప‌డుతున్నారు. పార్టీ నాయ‌క‌త్వంపై అసంతృప్తి బ‌హిరంగంగానే వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. పార్టీ స‌మావేశాల్లోనే ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో చాన్నాళ్ల త‌రువాత వార్త‌ల్లోకి వ‌చ్చారు కాంగ్రెస్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రి. నిజానికి, ఆమె కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ నేత‌గా ఒక‌ప్పుడు పేరు పొందారు. కానీ, గ‌త కొన్నాళ్లుగా ఆమె పార్టీకి సంబంధించిన కీల‌క స‌మావేశాల్లోగానీ, కార్య‌క్ర‌మాల్లోగానీ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం తాను క్రియాశీలంగా లేక‌పోవ‌డం కాదనీ, పార్టీలో కొంద‌రు కావాల‌నే త‌న‌ని ప‌క్క‌న పెడుతున్నారంటూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ నేత‌ల స‌మావేశం జ‌రిగింది. దీన్లో అభ్యర్థుల ఎంపిక ఎలా చెయ్యాలి, కామ‌న్ మేనిఫెస్టో రూపొందిస్తే ఎలా ఉంటుందీ, ఇలాంటి కొన్ని ప్ర‌తిపాద‌న‌ల మీద చ‌ర్చ జ‌రిగింది. ఇదే సంద‌ర్భంలో రేణుకా చౌద‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీలో తాను ఉన్నాన‌నీ, కాంగ్రెస్ కి క‌ట్టు‌బ‌డి త‌న స్థాయిలో పార్టీ కోసం ప‌నిచేస్తున్నాన‌నీ, క‌నీసం గుర్తించండి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డీసీసీ నియామ‌కాలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేసేస్తార‌నీ, క‌నీసం ఆ స‌మాచారం కూడా త‌న‌కు ఇవ్వ‌లేద‌న్నారు. పొత్తుల విష‌యం కూడా మీకు న‌చ్చిన‌ట్టే చేసేస్తారా… క‌నీసం ఒక మాట‌గానైనా స‌ల‌హా తీసుకోరా అంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కుంతియాల స‌మ‌క్షంలో నిల‌దీశారు. తెల్లారితే ఎన్నిక‌లు పెట్టుకుని హ‌డావుడిగా స‌మావేశాలు పెడితే ఏం ఉప‌యోగం అని ప్ర‌శ్నించారు. దీంతో కుంతియా స్పందించి… అంద‌రికీ ముందుగానే స‌మాచారం ఇచ్చామ‌నీ, మీరే ఆల‌స్యంగా స్పందించార‌న్నారు. దీంతో ఆమె మ‌రింత అసంతృప్తికి గురైన‌ట్టు స‌మాచారం.

రేణుకాతోపాటు ఈ స‌మావేశంలో పాల్గొన్న ఇత‌ర సీనియ‌ర్లు కూడా నాయ‌క‌త్వం మీద అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన‌ట్టు స‌మాచారం. అయితే, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల్ని సీనియ‌ర్ల మీదే పెట్ట‌డం విశేషం! నాయ‌క‌త్వం మీద ఇంత ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న సీనియ‌ర్లు… ఇప్పుడు పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయాలంటే మ‌నస్ఫూర్తిగా చేస్తారా అనేదే ప్ర‌శ్న‌? మీ అనుభ‌వాన్ని ఉప‌యోగించండ‌ని సులువుగా ఉత్త‌మ్ చెప్పేశారుగానీ… రాష్ట్ర స్థాయి నాయ‌కుల్ని మున్సిపాలిటీల స్థాయికి ప‌రిమితం చేస్తున్నార‌న్న అవ‌మానంగా వారు ఫీలౌతున్నారు. రేణుకా చౌదరి కూడా ఇదే ఆవేద‌న‌ను స‌మావేశం అనంత‌రం త‌న స‌న్నిహితుల‌తో వ్య‌క్తం చేశార‌ట‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close