వింటే బుజ్జ‌గించాలి… విన‌కుంటే బ‌హిష్క‌రించాల‌న్న సీఎం!

తెలంగాణ భ‌వ‌న్ లో పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మావేశం నిర్వ‌హించారు. ప్రారంభ‌మే కొంత‌మంది ఎమ్మెల్యేల‌కు క్లాస్ పీక‌డంతో మొద‌లైంది. స‌మావేశానికి ఆల‌స్యంగా కొంత‌మంది రావ‌డంతో, సీఎం కాస్త అసంతృప్తికి గుర‌య్యారు. ముందురోజు సాయంత్ర‌మే అంద‌ర్నీ హైద‌రాబాద్ చేరుకోవాలంటూ ఆదేశించినా.. కొంత‌మంది ఆల‌స్యంగా రావ‌డం సీఎం అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. స‌మావేశానికి హాజ‌రైన ఎమ్మెల్యేలు వారి ప‌రిధిలోని మున్సిపాలిటీల్లో ఎవ‌రికి టిక్కెట్లు ఇవ్వ‌బోతున్నారు, ఎవ‌రిని ఛైర్మ‌న్లుగా ప్ర‌తిపాదిస్తున్నారు అనేది ఖ‌రారు చేసి తెచ్చిన జాబితాల‌ను సీఎంకి ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల‌కి ఎ, బి ఫార‌మ్స్ ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అందించారు. అనంత‌రం మాట్లాడుతూ… తెరాస‌కు రాష్ట్ర‌మంతా అనుకూలంగా ఉంద‌న్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపును ఎమ్మెల్యేలంతా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

ప్ర‌ధానంగా రెబెల్స్ గురించి ఎక్కువసేపు స‌మావేశంలో చ‌ర్చ జరిగిన‌ట్టు స‌మాచారం. పార్టీ నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న‌వారు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు కాబ‌ట్టి, రెబెల్స్ బెడ‌ద ఉంటుంద‌ని సీఎం అన్నారు. మ‌రో నాలుగేళ్ల‌పాటు తెలంగాణలో తెరాస అధికారంలో ఉంటుంది కాబ‌ట్టి, ఇత‌ర ప‌దవులు లేదా ఇత‌ర అంశాల విష‌యంలో పార్టీ నుంచి ఏదో ఒక ‌ర‌క‌మైన మేలు క‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని వారికి హామీ ఇచ్చి బుజ్జ‌గించాలంటూ ఎమ్మెల్యేల‌కు సీఎం సూచించిన‌ట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్నిక‌లు లేక‌పోయినా పార్టీ ప‌ద‌వులు చాలా ఉంటాయ‌ని చెప్పాల‌న్నారు. ఇది త‌న మాట‌‌గా రెబెల్స్ కి చెప్పి పోటీని విమ‌ర‌మింప‌జేయాల‌ని ఎమ్మెల్యేల‌కు సీఎం చెప్పారు. ఒక‌వేళ అప్ప‌టికీ విన‌కుంటే… అలాంటివారిని పార్టీ నుంచి వేటు వెయ్యాల‌ని కూడా చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సంద‌ర్భంలో వేటుప‌డ్డ‌వారిని భ‌విష్య‌త్తులో ఎట్టి ప‌రిస్థితుల్లో తిరిగి తెరాస‌లోకి తీసుకునే అవ‌కాశం ఉండ‌ద‌నేది కూడా స్ప‌ష్టంగా తెలియ‌జేయాల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

తెరాస‌కి మున్సిపోల్స్ లో రెబెల్స్ బెడ‌ద తీవ్రంగానే ఉందనేది ముఖ్య‌మంత్రి మాట‌ల్లో అర్థ‌మౌతోంది. రెబెల్స్ ఇత‌ర పార్టీల‌వైపున‌కు వెళ్లే ఆలోచ‌న చేయ‌కుండా క‌ట్ట‌డి చేయాల‌నే వ్యూహం క‌నిపిస్తోంది. బుజ్జ‌గించాలి, లేదంటే భ‌విష్య‌త్తుపై భ‌యం క‌లిగించేలా హెచ్చ‌రిస్తూ బ‌హిష్క‌రించాల‌ని భావిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో చాలావ‌ర‌కూ రెబెల్స్ ని బుజ్జ‌గించేశామ‌ని, రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ చ‌ర్చే ఉండ‌ద‌ని కొంత‌మంది ఎమ్మెల్యేలు స‌మావేశం అనంత‌రం మీడియాతో చెప్పారు. చూడాలి.. సీఎం ఆదేశాలు ఏర‌కంగా ప‌నిచేస్తాయో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close