కాకినాడలో ద్వారంపూడి ప్రైవేటు సైన్యం హల్ చల్ ..!

కాకినాడలో ద్వారంపూడి చట్టం అమవలవుతోంది. పోలీసులు ఉన్నా లేనట్లే. ద్వారంపూడి అనుచరలే కర్రలు పట్టుకుని లా అండ్ ఆర్డర్‌ని.. తమదైన శైలిలో చక్కదిద్దుతున్నారు. కనిపించిన వారిని కనిపించినట్లు చావబాదేసి.. ఎవడొస్తాడో రండ్రా.. అంటూ.. సినిమాల తరహాలో సవాళ్లు చేస్తున్నారు. ఈ వీరంగం… ద్వారంపూడి ఇంటి దగ్గర.. ఆదివారం ఆవిష్కృతమయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి .. పవన్ కల్యాణ్‌ను .. శనివారం బండబూతులు తిట్టారు. దీనిపై జనసేన కార్యకర్తలు.. మండిపడ్డారు. కాకినాడలోని ద్వారంపూడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇలా ముట్టడిస్తారని తెలుసో లేక.. నిజంగానే.. ద్వారంపూడి ఇంటి వద్ద ఓ ముఠా ఎప్పుడూ రెడీగా ఉంటుందేమో కానీ.. జనసేన కార్యకర్తలపై.. కర్రలు, రాళ్లతో.. విరుచుకుపడ్డారు.

ఒక్క సారిగా పదుల సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి… దొరికిన వారిని దొరికినట్లుగా… చితకబాదారు. పోలీసులు అక్కడే ఉన్నారు. వారు తీరిగ్గా.. చూస్తూ కూర్చున్నారు. ద్వారంపూడి ప్రైవేటు గ్యాంగ్ దాడులకు భయపడి.. జనసేన కార్యకర్తలు.. సమీపంలో ఉన్న గుళ్లోకి వెళ్లారు. గడియ పెట్టుకున్నారు. ద్వారంపూడి గ్యాంగ్.. వదిలి పెట్టలేదు. బయటకు రావాలంటే.. గుడి తలుపులు బద్దలుకొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు తీరిగ్గా.. ద్వారంపూడి అనుచరుల్ని.. వెనక్కి పంపేసి.. జనసేన కార్యకర్తల్ని మాత్రం తీసుకెళ్లారు. చట్టాన్నిచేతుల్లోకి తీసుకుని.. దాడాలుకు పాల్పడిన.. ద్వారంపూడి ప్రైవేటు గ్యాంగ్‌ను మాత్రం.. పోలీసులు పల్లెత్తు మాట అనలేదు. పోలీసుల తీరుపై జనసేన మండిపడింది.

ఇదే పోలీసింగ్ అని.. ప్రశ్నించింది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. ప్రైవేటు గ్యాంగుల చేతుల్లోకి రాష్ట్రం పోయినట్లుగా ఉంది. పోలీసుల పేరుతో.. ఎవరెవరో దాడులకు పాల్పడున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా పోలీసులు ఉన్న చోట వైసీపీ నేతలు.. నేరుగా దాడులు చేసి.. చట్టానికే సవాల్ చేస్తున్నారు. అమరావతి.. కాకినాడ.. ఎక్కడ చూసినా.. పరిస్థితి తేడా గా ఉందనే అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close