బడ్జెట్‌ తర్వాత విశాఖ నుంచే జగన్ పాలన..!

జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లుగా… తాను ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అనే ఫార్ములాను ఫాలో అయిపోవాలని అంతిమంగా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మోహమాటంగా ప్రకటించారు. బడ్జెట్ తర్వాత ఏ క్షణం నుంచైనా సరే.. విశాఖ కేంద్రంగా చేసుకుని ముఖ్యమంత్రి పరిపాలన ప్రారంభిస్తారని ప్రకటించారు. హైకోర్టును కర్నూలుకు తరలించడం.. కార్యాలయాలను విశాఖకు తరలించడం అన్నీ పద్దతి ప్రకారం జరుగుతాయని ప్రకటించారు. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. ప్రధానితో భేటీ అయిన సమయంలోనే పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం పీటముడి పడింది. బిల్లులు శాసనమండలిలో ఉండిపోయాయి. అటు ఆమోదం పొందాయని చెప్పడానికి లేదు. ఇటు సెలక్ట్ కమిటీ పనిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదు.

పరిపాలనా సౌలభ్యం కోసం కార్యాలయాలను తరలిస్తున్నామని కోర్టులో చెబుతున్న వాదనలూ అంత తేలిగ్గా తేలే అవకాశం లేకపోవడంతో… తాను ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని అన్న విధానానికి ఫిక్సవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కోర్టులు కూడా.. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన చేయాలని నిర్దేశించలేవు కాబట్టి.. అడ్డుకోలేరని ప్రభుత్వ వర్గాలుభావిస్తున్నాయి. కార్యాలయాల తరలింపు విషయంలో.. అన్నీ పద్దతి ప్రకారం జరుగుతాయని ప్రకటించడం వెనుక కూడా వ్యూహం ఉందంటున్నారు. కార్యాలయాల తరలింపు విషయంలో హైకోర్టు అనేక ప్రశ్నలు వేస్తోంది.

సచివాలయంలో స్థలం లేక విజిలెన్స్‌ను కర్నూలు తరలిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను ధర్మానసం తప్పు పట్టింది. సచివాలయంలో స్థలం సరిపోకపోతే.. వేరే బిల్డింగ్‌లోకి మార్చుకోవచ్చుకదా అని ప్రశ్నించింది. సెక్రటేరియట్‌లో ఎంతమంది పనిచేస్తున్నారని ప్రశ్నించింది. విజిలెన్స్‌ ఆఫీస్‌ ఓచోట, ఉద్యోగులు మరో చోట ఉంటే పని ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఇవన్నీ కోర్టులో తేలే అంశాలు కాకపోవడంతో.. ముందుగా సీఎం.. తాను విశాఖ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close