‘నార‌ప్ప’‌ షూటింగ్ క‌ష్టాలు

త‌మిళ ‘అసుర‌న్‌’ తెలుగులో `నార్ప‌ప‌` పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ప్రియ‌మ‌ణి, అమ‌లాపాల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రస్తుతం త‌మిళ‌నాడు లోని ఓ ప‌ల్లెటూరులో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అక్క‌డ ఓ పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. నిజానికి అనంత‌పురంలో తీయాల్సిన పాట ఇది. అక్క‌డ కొంత‌మేర షూటింగ్ కూడా సాగింది. అయితే… జ‌న సందోహం మ‌ధ్య షూటింగ్ చేయ‌డం చిత్ర‌బృందానికి క‌ష్ట‌మైంది. షూటింగ్ జ‌రుగుతుండ‌గా జ‌నం చొచ్చుకుని రావ‌డం వ‌ల్ల షూటింగ్‌కి ఇబ్బంది క‌లుగుతుంద‌ని తెలుస్తోంది. చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు చుట్టు ప‌క్క‌ల జ‌నం సెల్‌ఫోన్ల‌లో షూటింగ్‌త‌తంగాన్ని రికార్డు చేయ‌డం కూడా చిత్ర‌బృందాన్ని క‌ల‌వ‌ర పెట్టిస్తోంది. అందుకే అనంత‌పురం నుంచి త‌మిళ‌నాడుకి లొకేష‌న్ షిఫ్ట‌యిపోయింది. త‌మిళ‌నాడులోని కోవిల్ ప‌ట్టి అనే గ్రామం.. అనంత‌పురం నెటివిటీని పోలి ఉన్న‌ట్టు చిత్ర‌బృందం గుర్తించింది. అందుకే అక్కడికి చిత్ర‌బృందం పయ‌న‌మైంది. దాదాపు నెల రోజుల పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close