అధికారయంత్రాంగంలోనూ “సిట్” అలజడి..!

ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం “సిట్‌” టీడీపీని టార్గెట్ చేసి ఏర్పాటు చేశారన్నదానిపై.. చాలా మందికి ఎలాంటి డౌట్‌లు లేవు. కానీ అంతకు మించిన ప్రయోజనాలు సిట్‌లోఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం అధికార యంత్రాగానికి ఈ సిట్ ఓ వార్నింగ్ బెల్‌గా మారబోతోందనే అభిప్రాయం అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది. దానికి కారణం… ఈ సిట్ ఎలాంటి చర్యలు తీసకున్నా.. ముందుగా ఆ ఎఫెక్ట్ పడేది.. అధికారులపైనే. ఎందుకంటే.. ప్రభుత్వం రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా.. దాన్ని అమలు చేసేది అధికారులే. తీసుకున్న నిర్ణయం నిబంధనల ప్రకారం లేదని తెలిస్తే.. ముందుగా.. సంతకం పెట్టిన అధికారి బాధ్యుడవుతాడు.

అందుకే ప్రభుత్వం నియమించిన సిట్ విషయంలో… అధికారవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో కీలక విధులు నిర్వహించిన అధికారులను సిట్ ప్రత్యేకంగా విచారిస్తుందా.. లేక.. ప్రభుత్వ పరమైన నిర్ణయాలన్నింటిపై సంతకాలు చేసిన వారిని ప్రశ్నిస్తుందా.. అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈఎస్‌ఐ స్కాం అంటూ.. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా .. పోలీస్ స్టేషన్ హోదా ఉన్న సిట్ … కేసులు నమోదు చేసి..విచారణ చేయడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందుగా… అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్న కన్నా ముందుగా సంబంధిత అధికారులే బాధ్యులవుతారు. అచ్చెన్న … ఫలానా సేవలు పొందాలని లేఖరాశారు కానీ.. ఫలానా కంపెనీకి ఇవ్వమని లేఖలు రాయలేదు. దానికి సంబంధించిన వివరాలు ఆయన బయట పెట్టారు. ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి ఆధారాలు ఏమైనా దొరికితే.. ముందు.. ఆ శాఖ చూసిన అధికారులు టార్గెట్ అవుతారు.

ఒక్క సిట్ వ్యవహారంలోనే.. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి బయటపడిందంటే.. ఖచ్చితంగా అధికారుల ప్రమేయం ఉంటుంది. గతంలో… జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో… అనేక మంది ఐఏఎస్ అధికారులు సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరందరూ.. నిబంధనలకు విరుద్ధంగా… వ్యవహరించారన్న కారణంగానే… వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు సిట్ కూడా.. అలాగే అధికారులపై కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది. అదే.. ఇప్పుడు.. అధికారవర్గాలను.. స్టిఫ్‌గా సిట్‌ చేయిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close