హీరోయిన్ మిస్సింగ్ అంటూ పోలీసు కేసు, పబ్లిసిటీ స్టంటా?

మొన్న విడుదలైన రాహు సినిమా హీరోయిన్ కృతి గార్గ్ మిస్సింగ్ అంటూ దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం ముంబై నుండి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ పేరుతో ఫోన్ కాల్ వచ్చిందని, బాలీవుడ్ లో అవకాశం గురించి చర్చించడానికి రమ్మని ఫోన్ చేయడంతో హీరోయిన్ ముంబై బయలుదేరి వెళ్లిందని, అయితే ఉదయం నుండి హీరోయిన్ ఫోన్ కలవడం లేదని, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని దర్శకుడు సుబ్బు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇది నిజంగా మిస్సింగ్ కేసా లేకపోతే పబ్లిసిటీ స్టంటా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

గత శుక్రవారం విడుదలైన రాహు సినిమా లో అభిరాం, కృతి గార్గ్ హీరో హీరోయిన్లు గా నటించగా సుబ్బు దర్శకత్వం వహించారు. మరీ గొప్పగా కాకపోయినా సినిమాకు ఒక మోస్తరుగా మంచి రివ్యూస్ వచ్చాయి. అయితే ఓపెనింగ్స్ అంత గొప్పగా లేవు. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో, ఒత్తిడికి గురైనప్పుడు తాత్కాలికంగా అంధురాలి మారిపోయే పాత్రలో హీరోయిన్ నటించారు. తీసుకున్న పాయింట్లో కాస్త వైవిద్యం ఉన్నప్పటికీ, సమీక్షలు ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవడంతో సినిమా యూనిటే, హీరోయిన్ మిస్సింగ్ అంటూ పబ్లిసిటీ స్టంట్ ఏమైనా చేస్తుందా అన్న అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతుంది. దానికి ప్రధాన కారణం, కేవలం ఈరోజు ఉదయం నుండి హీరోయిన్ ఫోన్ రీచ్ అవ్వడం లేదు అంటూ కంప్లైంట్ చేయడం. పైగా కంప్లైంట్ కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులు కాకుండా సినిమా దర్శకుడు చేయడం.

మొత్తం మీద హీరోయిన్ మిస్సింగ్ కేసు నిజమా లేక పబ్లిసిటీ స్టంటా, ఒకవేళ పబ్లిసిటీ స్టంట్ అయితే సినిమా యూనిట్ ఆశించిన ఫలితాన్ని ఈ స్టంట్ ఇస్తుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టు చెప్పినా తప్పే : సజ్జల

వైసీపీ నేతలు తాము ఏది చెస్తే అది.. ఏం చెబితే అది మాత్రమే ఫైనల్ అనుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును సైతం ... వాళ్లు చెబితే కరెక్టా అని...

క‌థాక‌మామిషు – ఈ వారం క‌థ‌ల‌పై స‌మీక్ష‌

సాహితీ ప్ర‌పంచంలో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. ప్ర‌తీరోజూ ఎన్నో క‌థ‌లు పుడుతుంటాయి. అందులో కొన్ని ప్ర‌చుర‌ణ వ‌ర‌కూ వెళ్తాయి. అలాంటి క‌థ‌ల్ని పాఠ‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న‌దే 'క‌థాక‌మామిషు' ప్ర‌ధాన ఉద్దేశం. ఈ...

మ‌ళ్లీ హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయా?

శేఖ‌ర్ కమ్ముల 'హ్యాపీడేస్‌' చాలామంది జీవితాల్ని మార్చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్థిర‌ప‌డిపోయిన‌వాళ్లు ఎంతోమంది. అందులో టైస‌న్ గా మెప్పించిన రాహుల్ కూడా 'హ్యాపీడేస్' త‌ర‌వాత హీరోగా మారాడు. కొన్ని సినిమాలు...

లిక్క‌ర్ స్కాంపై ఈడీకి ఎమ్మెల్సీ క‌విత చెప్పిన స‌మాధానాలు ఇవే

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నా పాత్ర లేదంటూ ఎమ్మెల్సీ క‌విత ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. అరుణ్ పిళ్లై త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని... వీకెండ్స్ లో క‌లిసేవారిమ‌ని, అయితే నా త‌ర‌ఫున పెట్టుబ‌డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close