బుగ్గనకు ఎన్నికలు కాదు.. బడ్జెట్ బ్యాలెన్సే పరీక్ష..!

బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా బాధ్యతను అనుచరులకు అప్పగించేసి ఆయన ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ నిధులు ఇచ్చే అవకాశంఉన్న ప్రతీ కేంద్రమంత్రిని కలుస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి..రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. ఆర్థిక సంఘం నిధులు … రూ. ఐదు వేల కోట్లు వెంటనే ఇవ్వాలని కూడా కోరారు. అంతకు ముందు 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎంకే సింగ్‌తోనూ భేటీ అయ్యారు. రాష్ట్ర లోటు బడ్జెట్ గురించి.. తమకు ఎక్కువ కేటాయింపులు వచ్చేలా చూడాలని కోరారు.

కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ని కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పెండింగ్ నిధులునుకోరారు. అయితే.. కేంద్రం ఎన్ని సార్లు అడిగినా ఒకటే సమాధానం చెబుతోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… ఇప్పటికే.. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు ఇచ్చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదేమీ లేదు కాబట్టి… పెండింగ్ ఏమీ లేవు. 2014 కన్నా ముందు ఖర్చు పెట్టిన నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది.కానీ వాటి ఆడిటింగ్ మాత్రం సాధ్యం కావడం లేదు. ఆ నిధులు రావాలంటే.. ఆడిటింగ్ జరగాల్సిందేనని కేంద్రం అంటోంది. ఇక కేంద్ర ప్రభుత్వం .. పన్నుల్లో వాటాలు తప్ప.. ఏపీకి ప్రత్యేకంగా రూపాయి కూడా కేటాయించే పరిస్థితుల్లో లేదు. బడ్జెట్‌లో కూడా చెప్పలేదు. లోటు బడ్జెట్ ను.. పూరించే అవకాశమే లేదు.

అయినప్పటికి.. 31వ తేదీన బడ్జెట్ పెట్టాలనుకుంటున్న బుగ్గన… నవరత్నాలన్నింటికీ తగినట్లుగా నిధులు కేటాయించాలంటే.. ఎంతో కొంత… కేంద్రం నుంచి సాయం పొందాలని అనుకుంటున్నారు. ఇప్పటికే .. దాదాపుగా 30వేల కోట్ల లోటులోకి ఏపీ వెళ్లిపోయింది. ఆర్థిక వనరులు తగ్గిపోతున్న కారణంగా.. దీన్ని భర్తీ చేసుకోవడం కష్టంగా ఉంది. బుగ్గన ఢిల్లీ నుంచి ఎలాంటి హామీలు పొందారో బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close