ఎన్టీఆర్ సినిమాల‌న్నీ ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్‌తోనే?

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే.. ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ‌లాంటిదే. ఈ బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్ చేసిన `జై ల‌వ‌కుశ‌` మంచి లాభాల‌నే అందించింది. ఇక మీద‌ట ప్ర‌తీ సినిమాకీ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ని భాగ‌స్వామిగా చేయాల‌ని తార‌క్ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్ర‌తీ అగ్ర హీరో ఓ సొంత నిర్మాణ సంస్థ‌ని మెయింటైన్ చేస్తున్నాడు. మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, బన్నీ, ప్ర‌భాస్‌.. వీళ్లంద‌రి చేతుల్లో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు ఉన్నాయి. పారితోషికం తీసుకోకుండా, నిర్మాణంలో భాగం పంచుకొని, లాభాల్లో వాటా అందుకుంటున్నారు. ఇది మ‌రింత లాభ‌దాయ‌కంగా క‌నిపించ‌డంతో… సొంత బ్యాన‌ర్‌ని భాగ‌స్వామిగా మారుస్తున్నారు. ఎన్టీఆర్‌కీ ఇదే ఆలోచ‌న వ‌చ్చింది. ఇక నుంచి ఎన్టీఆర్ పారితోషికాలు తీసుకోకుండా లాభాల్లో వాటా అందుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్‌ని రంగంలోకి దించాడు. అలా చేయ‌డం ఉభ‌య తార‌కం కూడా. అన్న‌య్య బ్యాన‌ర్‌లో సినిమాలు చేస్తున్న‌ట్టు ఉంటుందీ, మ‌రోవైపు ప్ర‌స్తుతం ట్రెండ్‌ను అందిపుచ్చుకున్న‌ట్టూ ఉంటుంది. ఎటొచ్చే.. ఎన్టీఆర్ తో సినిమా చేయాల‌నుకున్న నిర్మాత‌లే.. పార్ట‌న‌ర్ షిప్‌కి ఫిక్స‌వ్వాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close