నా ప్రాణానికే రక్షణ లేదు..! కేంద్రానికి రమేష్‌కుమార్ సంచలన లేఖ..!

ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని.. హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించి.. రక్షణ కల్పించాలని కోరుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. కేంద్ర హోంశాఖకు సంచలన లేఖ రాశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిస్థితులను ఆయన తన లేఖలో.. వివరించారు. ఎన్నికల సందర్భంగా.. సీఎం ఇచ్చిన ఆదేశాలతో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు… ఇష్టమొచ్చినట్లు వ్యవహరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయని.. లేఖలో.. ఎస్‌ఈసీ రమేష్ కుమార్ తెలిపారు. కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు అవసరమని లేఖలో పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల విషయాన్ని కూడా.. లేఖలో రమేష్ కుమార్ ప్రస్తావించారు. 2014లో ఎంపీటీసీల్లో 2 శాతం, జెడ్పీటీసీలో 0.09 శాతం ఏకగ్రీవాలు జరగగా.. 2020లో ఎంపీటీసీలో 24 శాతం, జెడ్పీటీసీలో 19 శాతం ఏకగ్రీవాలు జరిగాయన్నారు.

ఒక్క కడప జిల్లాలోనే ఎంపీటీసీల్లో 79శాతం, జెడ్పీటీసీల్లో 76శాతం ఏకగ్రీవం అయ్యాయని.. అక్కడ విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేశారని లేఖలో రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో సరిగ్గా పని చేయని అధికారులను.. తాను బదిలీ చేయమని ఆదేశిస్తే.. ప్రభుత్వం పట్టించుకోలేదన్న విషయాన్ని కూడా.. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో రమేష్ కుమార్ ప్రస్తావించారు. తనపై… కొద్ది రోజులుగా.. అధికార పార్టీ నేతలు.. చేస్తున్న కులపరమైన విమర్శలు.. వ్యక్తిగత హెచ్చరికల అంశాన్ని కూడా రమేష్ కుమార్ తన లేఖలో ప్రస్తావించారు. రమేష్ కుమార్తెపై.. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రమేష్ కుమార్.. తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని లేఖలో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో… ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు నిర్వహించాలంటే.. ఖచ్చితంగా కేంద్ర బలగాలు ఉండాలని రమేష్ కుమార్ కోరారు.

రమేష్ కుమార్ లేఖ..రాజకీయవర్గాల్లో సంచనలం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు… పోలీసులతో కలిసి.. ఇతర పార్టీల నేతల్ని బెదిరించి..హెచ్చరించి.. దొంగ కేసులు పెట్టి… ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మీడియాలో కూడా పెద్ద ఎత్తున వీటిపై ఆధారాలు ప్రసారమయ్యాయి. విపక్ష నేతలు కూడా ఫిర్యాదు చేశారు. చివరికి ఎన్నికల కమిషనర్.. వీటన్నంటినీ కేంద్రానికి నివేదించారు. ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరం.

[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2020/03/Letter-to-Home-Secretary-GOI.pdf.pdf.pdf” title=”Letter to Home Secretary GOI.pdf.pdf”]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close