ఆర్కే పలుకు : కమ్మ వాళ్లని రోహింగ్యాల కన్నా దారుణంగా చూస్తున్న జగన్..!

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్న కులద్వేషంపై తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో విరుచుకుపడ్డారు. సీఎం వ్యవహారశైలిని ఆయన తీవ్ర స్థాయిలో తప్పు పట్టడమే కాకుండా.. జగన్ తీరు… రోహింగ్యాల కన్నా దారుణంగా.. కమ్మవారిని చూస్తున్నారని మండిపడ్డారు. దీనికి కారణం .. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్‌ను.. కులం పేరుదో.. జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే. జగన్ చేసిన విమర్శల కారణంగా.. మొదటి నుంచి జగన్ చూపిస్తున్న కులద్వేషాన్ని … తన ఆర్టికల్‌లో చర్చకు పెట్టారు ఆర్కే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం కమ్మవాళ్లను కూల్చేయాడనికి సాగుతోందని.. పరోక్షంగా తేల్చేశారు. అంతే.. కాదు.. టీడీపీలోని కమ్మ నేతల్ని తన పార్టీలో చేర్చుకోవడానికి కూడా.. పార్టీ బలోపతం కోసం కాదట. కమ్మ వాళ్లు.. తమను ఎంత తిడుతున్నా.. సరే… తమ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారిపోతారని ప్రజల ముందు పెట్టడానికే.. జగన్మోహన్ రెడ్డి కమ్మ నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారట. ఈ విషయాన్ని వైసీపీలోని ఓ రెడ్డి నేత బయట పెట్టారని ఆర్కే చెబుతున్నారు. వైసీపీకి రెడ్డి సామాజికవర్గం మద్దతు ఎలా ఇస్తుందో.. కమ్మ వర్గం టీడీపీకి అలా మద్దతిస్తుందని.. అంత మాత్రాన కమ్మ వాళ్లంతా టీడీపీకే ఓ ట్లేస్తారని చెప్పి.. ఇలా.. వారిపై పగబట్టడం మాత్రం.. సంకుచిత మనస్థత్వానికి నిదర్శనమం ఆర్కే తేల్చేశారు.

జగన్ కమ్మ కులంపై ఎంత ద్వేషంతో రగిలిపోతున్నారని చెప్పడానికి ఆర్కే పలు కారణాలు చెప్పారు. అందులో.. బిల్లుల చెల్లింపు కూడా. ప్రభుత్వ పనులు చేసిన వారికి … వారు కమ్మ వాళ్లయితే.. బిల్లుల చెల్లింపు నిలిపివేయాలని స్పష్టమైనా ఆదేశాలు అందాయట. కులం పరంగా బిల్లులు .. పనులు చేయాలని.. ఆదేశాలు ఇవ్వడం అంటే.. బహుశా.. స్వతంత్ర భారత దేశ చరత్రలో ఏపీ చరిత్ర సృష్టించదన్నట్లుగా ఆర్కే రాసుకొచ్చారు. అదే సమయంలో రాష్ట్రానికి కమ్మ వాళ్లు చేసిన సేవలను గుర్తించారు. ఏపీ ఆర్థికాభివృద్ధిలో కమ్మవాళ్ల పాత్రను.. ఎవరూ విస్మరించలేరని స్పష్టం చేశారు. ఆర్టికల్ మొత్తంలో.. కులాభిమానం పెట్టుకుని.. తన కులపు వాళ్లందరికీ… వందల సంఖ్యలో పదవులిస్తున్న జగన్.. అదే ఇతర కులంపై ద్వేషం చూపించడం ఏమిటన్న ప్రశ్న ఆర్కే వేశారు. తన కులాభిమానం ఉంటే ఉండవచ్చు.. కానీ కులద్వేషం మాత్రం… పాలకుడికి ఉండకూడదని తేల్చి చెప్పారు. చివరిగా ముఖ్యమంత్రికి గుణం లేదు కాబట్టే.. కులం కులం అని కలవరిస్తాడని తల్చేశారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. జగన్ోహన్ రెడ్డి చూపిస్తున్న కులద్వేషాన్ని .. ఆర్కే ఆ ఆర్టికల్‌లో బట్టబయలు చేశారు. రోహింగ్యాల కన్నా దారుణంగా చూస్తున్నారన్న వ్యాఖ్య ద్వారా.. ఓ రకంగా ఆ కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారని అనుకోవచ్చు. గతంలో పవన్ కల్యాణ్ రెడ్లను ఏదో అన్నారని.. నాలుకు కోస్తామని… రెడ్డి సంఘం నేతలు తెరమీదకు వచ్చారు … కానీ ఇప్పుడు ఒక్రరంటే.. ఒక్క కమ్మ నేత బయటకు రాలేదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close