ఉద్యోగుల జీతాలు తగ్గించే సాహసం జగన్ చేయలగరా..?

ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్న కారణంగా ఉద్యోగుల జీతభత్యాల్లోనూ కోత పెట్టాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ పరిస్థితే అలా ఉంటే.. ఏపీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండాలి..? అన్న చర్చ సహజంగానే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగాచెప్పుకోనవసరం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. అరవై వేలకోట్లు అప్పులు చేసి ప్రభుత్వం సరికొత్తరికార్డు సృష్టించింది. దానికి తోడు ఇప్పుడు ఆదాయం పూర్తిగా పడిపోయింది.లాక్ డౌన్ కారణంగా.. రోజూ వచ్చే ఆదాయం రావడం లేదు. ఇలా ఎంత కాలం ఉంటుందో తెలియదు. కానీ ప్రభుత్వం.. ఖచ్చితంగా చెల్లించాల్సిన ఖర్చులో జీతాలు, పెన్షన్లు,సామాజిక పెన్షన్లు ఉంటాయి.

లాక్‌డౌన్‌తో పడిపోయిన ఏపీ ఆదాయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జీతాలు,పెన్షన్లు, సామాజిక పెన్షన్లతో వార్డు,గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు చెల్లించడానికి నెలకు ఎడెనిమిది వేల కోట్లు అవసరం అవుతాయి. ప్రతీ సారి జీతాల సమయం దగ్గర పడేసరికి అధికారయంత్రాంగానికి తిప్పలు తప్పడం లేదు. చివరి క్షణంలో ఓవర్ డ్రాఫ్ట్‌కో మరో…ప్రత్యామ్నాయమోచూపి బండి లాగించేస్తున్నారు.అయితే… అప్పట్లో ఎంత లేదన్నా… ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడీ ఆదాయానికి గండి పడింది.దీంతో ఆర్థిక పరిస్థితి మరింతగా చితికిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

సలహాదారులకు రూ.కోట్లకు కోట్లు ఇచ్చేస్తున్న ఏపీ..!

కరోనా, లాక్ డౌన్‌ల కారణంగా ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని … జీతాలు తగ్గించడమో.. లేకపోతే.. పథకాలు ఎగ్గొట్టడమో కూడా ధైర్యంగా చేయలేని పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రికి ఉంది. దీనికి కారణం..ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చే. సలహాదారుల పేరుతో పెద్ద ఎత్తున నియామకాలు జరిపిన ఏపీ సర్కార్.. ఒక్కొక్కరికి నెలకు రూ. నాలుగు లక్షల వరకూ ముట్ట చెబుతోంది. ఇలా సలహాదారుల జీతాలకే నెలకు.. మూడు, నాలుగు కోట్లు వెచ్చిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సాక్షి పత్రిక నుంచి పెద్ద ఎత్తున మనుషుల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకున్నారు. ఇలా తీసుకుంటున్న వారెవరికీ పని ఉండదు. కానీ వారందరికి ఠంచన్‌గా జీతాలువెళ్లిపోతాయి.

ఓ వైపు దుబారా చేస్తూ..మరోవైపు తమ జీతం తగ్గిస్తే ఎవరైనా ఊరుకుంటారా..?

అస్మదీయులకు లేని పదవులు ఇచ్చి కోట్ల ప్రజాధనాన్ని ఇట్టే పంచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. తీరా కష్టాలువచ్చాయని చెప్పి ఉద్యోగుల తీతాలు.. పథకాలను నిలిపివేయడం..వంటి చర్యలకు పాల్పడితే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కామ్‌గా ఉండే అవకాశం లేదు. ఇప్పటికే వారు సీపీఎస్ రద్దు కోసం ప్రయత్నిస్తున్నారు. జగన్ హామీఇచ్చి నెరవేర్చలేదు. ఇప్పుడు జీతాలు కూడా తగ్గిస్తామంటే తిరుగుబాటు చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close