ఏపీలో తొలి కరోనా మరణం..!

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదయింది. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా తెలుసుకుంది. కరోనా వైరస్ సోకిన కారణంగా .. 55 ఏళ్ల ఓ వ్యక్తి సోమవారమే మృతి చెందాడు. అయితే.. అతనికి కరోనా ఉందో లేదో తెలుసుకునే సరికి మూడు రోజులు పట్టిందని.. ప్రభుత్వం తెలిపింది. అతనికి కిడ్ని, గుండె సంబంధిత వ్యాధులున్నాయని..ఏ కారణంగా చనిపోయాడో తెలుసుకోవడానికే.. ఆలస్యమయిదని అధికారులు చెబుతున్నారు. అన్ని వివరాలు తెలిసిన తర్వాత అధికారికంగా ధృవీకరిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. మృతుని కుమారుడు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అతనికి మార్చి 30వ తేదీన పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఆయన ద్వారా.. ఆయన తండ్రికి వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరితో కాంటాక్ట్‌ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. మృతుని కుమారుడు ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. దేశంలో ఒకే రోజు.. పన్నెండు మంది కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఇది కరోనా కేసులు భారత్‌లో బయటపడిన తర్వాత అత్యధికం. మొత్తంగా ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారు 74మంది. తెలంగాణలో ఈ సంఖ్య 9.

మరో వైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు… భారీగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం 2640కి చేరాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మరో వారం రోజుల్లో పదివేలకు చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు.. వారితో కాంటాక్ట్ లో ఉన్న వారికే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close