రూ. వెయ్యి క్రెడిట్ బీజేపీకి కట్టబెడుతున్న టీడీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి లేనిపోని క్రెడిట్ కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీ కోసం.. ఇంత కాలం కష్టపడ్డారేమో కానీ.. ఆ పార్టీ నేతలు ఇప్పుడు.. బీజేపీ కోసం శ్రమిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. కరోనా సాయం కింద… బియ్యం కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం రూ. వెయ్యి పంపిణీ చేస్తోంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని చెబుతూ… వాలంటీర్లు కూడా కాకుండా.. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారే పంపిణీచేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఇదంతా కేంద్ర సాయం అని..జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అదే పనిగా… ఇది మోడీ ఇస్తున్న సొమ్ము అనిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా విమర్శలు చేస్తున్నారు . కేంద్ర సాయాన్ని తన సాయంగా ఎలా చెప్పుకుంటారని అంటున్నారు.

అయితే.. ఇదంతా టీడీపీ నేతల ఘోషే కానీ బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. ఓ ట్వీట్ చేసి.. సైలెంటయిపోయారు.కేంద్ర సాయాన్ని జగన్ పేరుతో పంచడాన్ని ఆయన ఖండించారు. అయితే.. బీజేపీ తరపున టీడీపీ నేతలే వకాల్తా పుచ్చుకున్నారు. అదే పనిగా మోడీకి దక్కాల్సిన క్రెడినట్ జగన్ తీసుకుంటున్నారని.. వాదించడం ప్రారంభించారు. కరోనా సాయం నిజానికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదు. విపత్తు నిధులు మాత్రం దండిగా ఇచ్చింది.

వాటి నుంచే.. ఏపీ ప్రభుత్వం.. సాయం పంపిణి చేస్తోంది. కేంద్రం జన్ ధన్ ఖాతాలు ఉన్న వారికి విడిగా నెలకు రూ. ఐదు వందలు అకౌంట్లలో వేస్తోంది. కానీ ప్రజలకు రూ. వెయ్యి పంచాలని ఎక్కడా చెప్పలేదు. విపత్తు నిధులను వాడుకునే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలే.. ఈ నిధులు ఇలా ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీకి క్రెడిట్ దక్కినా పర్వాలేదు కానీ… వైసీపీకి మాత్రం దక్కకూడదని.. టీడీపీ నేతలు.. బీజేపీకిమద్దతుగా ప్రచారం చేయడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close