దీపం పెట్టమంటే దీపావళి పండగ చేసేశారు..!

నరేంద్రమోదీ ఏం చెప్పారు..?

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఇంట్లో లైట్లు ఆర్పేసి.. ఒక్క క్యాండిల్.. అదీ లేకపోతే… ఓ టార్చ్.. అదీ లేకపోతే.. సెల్ ఫోన్ లైట్ ని తొమ్మిది నిమిషాల సేపు వెలిగించమని చెప్పారు. ఇలా ఎందుకు చేయాలో… ఇలా చేస్తే ఏం వస్తుందో… చెప్పే అవకాశాన్ని దేశంలో ఉన్న అన్ని రంగాల నిపుణులకు వదిలేశారు. సైన్స్, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం దగ్గర్నుంచి పుక్కిటి పురాణాల వరకూ.. అందులో నిపుణులం అని అనిపించున్నవారు.. అనిపించునేందుకు ప్రయత్నిస్తున్న వారు.. తమ తమ సిద్ధాంతాలను చెప్పారు. ఇవన్నీ.. చాలా మందికి బాగా ఎక్కేశాయి. ఒక్క దీపానికే అంత శక్తి ఉంటే… ఏకంగా దీపావళి పండగ చేసేస్తే.. ఇంకెంత గొప్పగా.. కోవిడ్ -19పై పోరాటం చేసినట్లుగా ఉంటుందని డిసైడయ్యారు. దీపావళి పండగ చేసేశారు.

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు.. టపాసుల మోత మార్మోగింది. అసలు దీపం ఆలోచనల దగ్గరే ఉండిపోయిన కొంత మంది ఉలిక్కిపడ్డారు. తాము తెచ్చుకోలేదని కొందరు… మోడీ గారు అలా టపాసులు కాల్చలేదని చెప్పలేదుగా అని మరికొందరు ఆలోచనలో పడ్డారు. కానీ ముందు చూపున్నవారు.. మోడీ చూసి రమ్మకంటే.. కాల్చివచ్చేందుకు సిద్ధపడేవారు మాత్రం.. టపాసులతో హోరెత్తించారు. లాక్ డౌన్ వల్ల.. తగ్గిపోయిన ఆ కాస్త కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేశారు. అసలు ఈ దీపం ఉద్దేశం ఏమిటో.. ఎవరూ ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. రోడ్ల మీదకు వచ్చేశారు. గో కరోనా గో..అంటూ గుంపులు, గుంపులుగా ర్యాలీలు తీశారు. సామాజిక దూరం కాదు కదా.. అసలు కరోనా గురించి టెన్షనే పడలేదు. పండగ చేసుకున్నారు.

దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. లాక్ డౌన్ లో ఉందని… వైరస్ అత్యంత దారుణంగా దాడి చేస్తోందన్న విషయాన్ని ప్రజలు ఆ కొద్ది సేపు మర్చిపోయారు. ఏ రూల్స్ పాటించలేదు.. ఏ నిబంధనలు అమలు చేయలేదు. ఇళ్లకే పరిమితమయి.. మానసికంగా… కొద్దిగా విశ్వాసాన్ని కోల్పోతున్న వారికి.. నమ్మకం కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగుంటాయేమో కానీ.. అతి ఉత్సాహంతో .. మొత్తం లక్ష్యానికే దెబ్బపడేలా చేయడం మన వాళ్ల స్పెషాలిటి. నాటి చప్పట్లలో కాస్త అతి కనిపించింది కానీ.. ఇప్పుడు అది పీక్స్ కు వెళ్లిపోయింది. నెక్ట్స్ .. బిగ్ బాస్ మోడీ ఎం టాస్క్ ఇస్తారో కానీ.. ఈ సారి మరింత రచ్చ రచ్చ అయిపోవడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close