లాక్‌డౌన్ తర్వాత ఆంక్షల జీవితం..!

లాక్‌డౌన్ ఎత్తివేతకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కానీ సాధారణ జన జీవితం మాత్రం.. తిరిగి రాదు. ఎక్కడికి వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రజలు ఆంక్షల జీవితానికి సిద్దం కావాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీ వరకూ… భారతీయుల జీవితాలు ఉరుకులు, పరుగుల మీద నడుస్తూ ఉండేవి. పెళ్లిళ్లు, సినిమాహాళ్లు. మాల్స్.. ఇలా.. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా కనిపించేవారు. మార్చి 22 రోజున జనతా కర్ఫ్యూతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మళ్లీ మార్చి 21వ తేదీ ముందు పరిస్థితులు అంత తేలిగ్గా రావు.

స్కూళ్లు ఉండవు.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉండదు.. సినిమాహాళ్లు ఉండవు.. మాల్స్ ఉండవు.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అసలే ఉండదు. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే… స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. లాక్ డౌన్ ఉన్నప్పుడే ఎవరూ… రూల్స్ లెక్క చేయని పరిస్థితి. అందుకే.. కరోనా కేసులు పూర్తిగా తగ్గి..భరోసా వచ్చిన తర్వాత మాత్రమే.. దేశంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేత సాధ్యమవుతుందని నిపుణుల అంచనా. కేంద్రం అభిప్రాయం కూడా దాదాపుగా అదే. అందుకే.. లాక్ డౌన్ అనేది నిరంతర ప్రక్రియ అని… కాకపోతే.. ఉపాధి దెబ్బతినకుండా.. రోజువారీ సాధారణ జీవితం గడిపేలా లాక్‌డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఉంటుందన్న అభిప్రాయం మాత్రం.. మెల్లగా కేంద్రం ప్రజల్లోకి పంపుతోంది..

అలా అని లాక్ డౌన్ పేరుతో.. అన్నింటికీ తాళాలు వేసుకుని కూర్చుంటే.. ఆకలి చావులు ప్రారంభమవుతాయి. అందుకే కేంద్రం వరుసగా.. మినహాయింపులు ఇస్తూ పోతోంది. నెల రోజులయిన సందర్భంగా వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు.. గ్రీన్ జోన్లలో వ్యాపార వ్యవహారాలను పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర దుకాణాలను తెరిచేందుకు చాన్స్ ఇచ్చింది. అయితే అన్నీ గ్రీన్ జోన్ల పరిధిలో మాత్రమే అమలవుతాయి.. మే మూడో తేదీ తర్వాత ప్రజలకు కొంత రిలీఫ్ దొరకవచ్చు. కానీ పూర్తి స్థాయిలో కాదు. అడుగడుగునా ఆంక్షల జీవితం గడపాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close