సంచలనం: టీడీపీలోకి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్!

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీనుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జరుగుతుండగా, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఒకేసారి ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి దూకబోతున్నారని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వైసీపీకి చెందిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధమైపోయారు. జలీల్ ఖాన్ ఇవాళ కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుతో కలిసి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును విజయవాడలో ఆయన నివాసంలో కలిశారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ కూడా అక్కడే ఉన్నారు. ఆ భేటి తర్వాత దేవినేని ఉమ, జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా తెలుగుదేశంవైపు చూస్తోందని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు మహా సంకల్పాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారని ఉమా చెప్పారు. అభివృద్ధి చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని అన్నారు. పోలవరం, రాయలసీమలో హంద్రీ నీవా గాలేరు వంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. జలీల్ ఖాన్ మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృధ్ధి, మైనారిటీ సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిశానని, టీడీపీలో ఇంకా చేరలేదని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ముస్లిమ్‌లు ఎవరూ లేరు కాబట్టి జలీల్ ఖాన్‌కు మంత్రి పదవి ఇవ్వొచ్చని అంటున్నారు.

మిగిలిన ఏడుగురు కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. వీరిలో కడప నుంచి ఇద్దరు, ప్రకాశం నుంచి ఇద్దరు, కృష్ణాజిల్లానుంచి ఇద్దరు, నెల్లూరు నుంచి ఒక్కరు ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే వైసీపీకి రాష్ట్రంలో పెద్ద దెబ్బేనని చెప్పాలి. ఇదిలాఉంటే ఈ పరిణామాలపై వైసీపీ పార్టీ సొంత మీడియా సాక్షి డేమేజ్ కంట్రోల్ ప్రారంభించింది. తాము పార్టీ మారబోవటంలేదంటూ జలీల్ ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు చెప్పినట్లు స్క్రోలింగ్ ఇస్తోంద.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close