ప్యాకేజీ 5.0: రాష్ట్రాలకు నాలుగున్నర లక్షల కోట్లు..!

ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీలో ఐదో భాగాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో ఆదాయం కోల్పోయిన రాష్ట్రాల కోసం పెద్ద ఎత్తున నిధులు అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రాలు తమ జీడీపీలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటే.. దాన్ని ఐదు శాతానికి పెంచామని ప్రకటించారు.

రాష్ట్రాలకు అందుబాటులో లక్షల కోట్ల రుణాలు..!

వైరస్ ప్రభావం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ.. రూ. 46వేల కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశామని.. మరో రూ. 11వేల కోట్లు విపత్తు నిధులు అందించామన్నారు. వివిధ పద్దతుల ద్వారా రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న నిధుల గురించి నిర్మలా సీతారామన్ వివరించారు. రాష్ట్రాలకు అందుబాటులోకి తెచ్చిన రుణాల్లో కేవలం 14 శాతం మాత్రమే వినియోగించుకున్నాయని ఇంకా రూ.4.28లక్షల కోట్లు రుణాల రూపంలో అందుబాటులో ఉన్నాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఐదో ప్యాకేజీలో… ఉపాధి హామీ పథకానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. రూ. 40వేల కోట్లను అదనంగా.. కూలీలకు పని కల్పించడానికి కేటాయించారు. దీని వల్ల 300 కోట్ల పని దినాలు కూలీలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కోవిడ్ ఆస్పత్రుల బ్లాక్స్, అన్ని జిల్లాల్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. విద్యారంగంలోనూ సంస్కరణలు ప్రకటించారు. టాప్ 100 యూనివర్శిటీల్లో ఆన్ లైన్ క్లాసులకు అనుమతి ఇవ్వబోతున్నామన్నారు.

ఉపాధి హామీకి నిధులు.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు..!

లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న సంస్థలకు మేలు చేయడానికి కొన్ని నిబంధనలు మార్చారు. వైరస్ కారణంగా ఎఫెక్ట్ అయితే… ఒక ఏడాది పాటు దివాలా చర్యలు తీసుకోబోమని ప్రకటించారు. డిఫాల్టర్ల కింద రారని ఆర్థికమంత్రి చెప్పారు. ఏడు రకాల కంపౌండబుల్ అఫెన్సిస్ ను తీసేస్తున్నట్లుగా ప్రకటించారు. ఐదుంటిని పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగాన్ని నిలిపివేస్తారు. కంపెనీల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యవహారాల కోసం కొన్ని రిఫార్మ్స్‌ను ప్రకటించారు. కొత్త పబ్లిక్ సెంటర్ ఎంటర్ ప్రైజెస్‌ను ప్రకటించారు. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రసంగం ముందే.. ఇంతకు ముందు ఏమేమి ప్రజలకు ఇచ్చామో ఆర్థిక మంత్రి వివరారు. 20కోట్ల జన్‌ధన్‌ఖాతాల్లోకి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద నగదు బదిలీ.. 12లక్షలమంది ఈపీఎఫ్‌లో చందాదారులు ఆన్‌లైన్‌ ఉపసంహరణలతో రూ.3,660 కోట్ల నగదును వెనక్కు తీసుకునే అవకాశం కల్పించామనని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమ చేశామన్నారు

మొత్తం ఆత్మ నిర్భర ప్యాకేజీ విలువ రూ. 21 లక్షల కోట్లు..!

మొత్తంగా ఐదు రోజుల పాటు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలతో కలిపి.. ఆత్మ నిర్భర అభియాన్ లో బాగంగా ప్యాకేజీ విలువ మొత్తం రూ. 20,97,053 కోట్లకు చేరింది. మొదటి రోజు ఎంఎస్ఎంఈలతో పాటు ఇతర రంగాలకు.. రూ. 5,94,550 కోట్లు, రెండో రోజు రూ. 3,10,000 కోట్లు, మూడో రోజు రూ. 1,50,000 కోట్లు, నాలుగో రోజు.. రూ. 48,100 కోట్లను ప్రకటించారు. మొత్తంగా రూ. 11 లక్షల 2650 కోట్లు అయ్యాయి. అంతకు ముందు ప్రధాని మోదీ గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా రూ 1,92,000 కోట్లు కేటాయించారు. ఆర్బీఐ రూ. 8,01,603 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం కలిపితే దాదాపుగా ఇరవై ఒక్క లక్షల కోట్లు అయ్యాయని ప్రభుత్వం లెక్క చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

మీడియా వాచ్ : సీఎం రమేష్‌తో డిబేట్‌లో ఓడిపోయిన టీవీ 9

టీవీ చానల్ చేతుల్లో ఉంది. అంతకు మించి సీక్రెట్ బాసులను మెప్పించేందుకు తెరపై చేసే విన్యాసాలకు లెక్కలేనన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంత వరకూ అదే చేశారు. కానీ అంతా సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close