ఏపీ నుంచి రాకపోకల్ని నిషేధించిన తెలంగాణ..!

తెలంగాణలో కరోనా కేసులు పెరగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. ఈ మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర,గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. గుజరాత్, మహారాష్ట్రల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం.. పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదు. వలస కూలీలు, కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉన్న కేసులే నమోదవుతున్నాయి. అయినప్పటికీ..ఏపీ నుంచి రాకపోకల్ని తెలంగాణ సర్కార్ నిషేధించడమే ఆశ్చర్యకరంగా మారింది.

ఏపీలో తెలంగాణకు చెందిన పలువురు వలస కార్మికులు ఉన్నారని వారిని తెలంగాణకు పంపిస్తామంటే….తెంలగాణ ప్రభుత్వం స్పందించడం లేదని..హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించిన రోజే.. తెలంగాణ సర్కార్ ఏపీ నుంచి రాకపోకలు నిషేధించడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణతో మహారాష్ట్రకు సరిహద్దు ఉంది. ఈ మేరకు.. ఆ రాష్ట్రం నుంచి రాకపోకల్ని నిషేధించినా ఓ అర్థం ఉంది. కానీ ఏపీ నుంచి రాకపోకల్ని నిషేధించడం మాత్రం కాస్త ఆశ్చర్యకరమేనంటున్నారు.

లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్న సమయంలో… ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు. తెలంగాణతో సరిహద్దు లు ఉన్న జిల్లాలు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉందని.. అందుకే..వారి ఆ రాష్ట్రం నుంచి రాకపోకల్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ పోలీసులు పాస్‌ల జారీని నిలిపివేశారు. ప్రజా రవాణాకు అనుమతి ఇచ్చే వరకూ..ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close