వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా సీఎంను కలిసే అవకాశం ఉంది. అధికారంగా పార్టీలో చేరరు. వైసీపీ అధినేత రాజీనామా చేయించిన తర్వాతే చేర్చుకోవాలనే ఓ నియమం పెట్టుకున్నారు. గతంలోనూ వీరిపై పార్టీ మార్పు కథనాలు వచ్చినా… ఇప్పుడు చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ పార్టీకి షాక్ ఇవ్వాలని కొద్ది రోజుల నుంచి వైసీపీ అగ్రనేతలు ప్లాన్‌లో ఉన్నారు. చివరికి చర్చలు జరిపి… ఓకే చేశారు.

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ లు వైసీపీకి మద్ధతు పలికారు. ఇప్పుడు మరో ఇద్దరు పార్టీని వీడుతూండటంతో.. గెలిచిన ఇరవై మూడు మందిలో ఐదుగురు గుడ్ బై చెప్పినట్లు అవుతుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో నేరుగా విజయసాయిరెడ్డి చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఈ చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. తమపై తీవ్ర ఒత్తిడి ఉందని.. బుజ్జగించాలని ప్రయత్నించిన టీడీపీ నేతలకు వారు తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. పర్చూరు ఎమ్మెల్యేకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఆయన కంపెనీల ఉత్పత్తుల్ని ఏపీలో అమ్మడం ఆపేశారు. దీంతో ఆయన ఆర్థిక చిక్కుల్లో పడ్డారు.

ఎన్నికల సమయంలోనే రేపల్లె ఎమ్మెల్యేకు హైదరాబాద్ ఆస్తుల విషయంలో బెదిరింపులు వచ్చాయని ప్రచారం జరిగింది. నిజమేనని.. ఆస్తులు పోయినా.. తాను టీడీపీ తరపున బరిలో ఉంటానని అప్పట్లో సత్యప్రసాద్ ప్రకటించారు. తనకు బాగా అప్పులయ్యాయని ఆ ఎమ్మెల్యే తన అనుచరుల వద్ద పార్టీ మార్పు కారణాలను చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ వీడి వెళ్లేవారిని బతిమిలాడొద్దని అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close