అత్యంత ఎత్తులోకి గోదావరి జలం.. కేసీఆర్ పట్టుదలకు మరో విజయం..!

తెలంగాణ సీఎం కేసీఆర్… తాను గురువుగా పూజించే చినజీయర్‌ను కలిసి.. కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి కారణం అది ఆయన సొంత గడ్డ సిద్ధిపేటలో ఉండటం మాత్రమే కాదు.. కొండపోచమ్మ సాగర్ ఓ అనితర సాధ్యమైన నిర్మాణం. ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా కీర్తిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి జలాలను పంపింగ్‌ చేస్తుంది ఈ కొండ పోచమ్మ సాగర్‌ ప్రాజెక్ట్‌కే. శుక్రవారం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే..ప్రాజెక్ట్‌లోకి గోదావరి నదిపై మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి వివిధ దశల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల ద్వారా తరలించే నీరు 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయ్‌లోకి చేరనున్నాయి.

15 టీఎంసీల సామర్థ్యం కల్గిన కొండ పోచమ్మ సాగర్‌ నుంచి గ్రావిటీ ద్వారా నీరు కరువుప్రాంతాలను చేరనుంది. తమను చల్లగా చూసే దేవతగా కొండ పోచమ్మను కొలుస్తారు లక్షలాది మంది భక్తులు. సిద్దిపేట, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, యాదాద్రి …ఈ ఐదు జిల్లాల్లోని రెండు లక్షల 85 వేల ఎకరాలకు సాగునీటి అవసరాలతో పాటు, తాగునీటి అవసరాలు తీర్చే కొండ పోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా..చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్‌లోని కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి.

కరువు సీమలో అర కిలోమీటరు ఎత్తుకు గోదావరి పరవళ్లు తొక్కుతాయి. ఈ ప్రాజెక్ట్ ను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు నిధులు కూడా కేటాయించారు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కొండ పోచమ్మ రిజర్వాయర్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ దిశగా ప్రమోట్ చేయడానికి ప్రారంభోత్సవం నుండే ప్రయత్నాలు చేయబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close