పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవోను పట్టుకుని ఈదుతున్న టీ కాంగ్రెస్..!

తెలంగాణ ఏర్పడి ఆరేళ్లయిన సందర్భంగా..తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయాలా అని ఆలోచించి… పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోనే పట్టుకుని రాజకీయంగా ఈదాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణాపై పెండింగ్ ప్రాజెక్టుల వద్ద జల దీక్షల ప్రోగ్రాం పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం జగన్ జీవో ఇచ్చినా కేసీఆర్ మాట్లాడటం లేదని.. దక్షిణ తెలంగాణను ఎడారి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్బీసీ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి , ఖమ్మం పాలేరు జలాశయం వద్ద భట్టి, సీతక్క, పొడెం వీరయ్య , వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి పంపు హౌస్ వద్ద రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. ఇతర ప్రాంతాల్లో ఇతర నేతలు దీక్షలకు కూర్చుంటున్నారు.

ప్రాజెక్టులు.. నీటి విషయంలో తెలంగాణ సర్కార్‌కు.. ప్రజల్లో మంచి పేరే వచ్చింది. రైతుల్లో… సానుకూలత కనిపిస్తోంది. అయితే.. పొరుగు రాష్ట్రం ఇచ్చిన ఓ జీవోను పట్టుకుని… ఆ సానుకూలతను వ్యతిరేకతగా మార్చాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చేయడం… సొంత పార్టీలోనే కొంత మందికి నచ్చడం లేదు. ఏపీ సర్కార్ కేవలం జీవోనే ఇచ్చిందని… ఎన్జీటీ సహా.. అపెక్స్‌ కౌన్సిల్ సహా..అన్నీ ఆపేయమని.. చెప్పాయని ఇప్పుడు దాన్ని వివాదాస్పదం చేయడం ఎందుకని అంటున్నారు. అలా చేయడం వల్ల సెంటిమెంట్ పెరుగుతుందని.. దాని వల్ల టీఆర్‌ఎస్‌కే లాభమని గుర్తు చేస్తున్నారు.

అయితే.. కాంగ్రెస్ మాత్రం.. పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవోను పట్టుకునే రాజకీయం చేయాలని నిర్ణయించేసుకుంది. కాంగ్రెస్‌లో నేతల మధ్య సఖ్యత లేదు. ఇప్పటికే.. పీసీసీ చీఫ్ పీఠం విషయంలో రేవంత్ రెడ్డి అండ్ అదర్స్ అన్నట్లుగా విడిపోయారు. సమైక్యంగా ఈ ప్రాజెక్టు దీక్షల్ని అయినా చేస్తారో.. లేక ఎవరికి వారో అన్నట్లుగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నేతల్లో ఉన్న అనైక్యతను టీఆర్ఎస్ నేతలు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close