స‌గం సీట్ల‌తో థియేట‌ర్లు న‌డ‌ప‌గ‌ల‌రా?

హౌస్‌ఫుల్ బోర్డులు చూడాల‌ని క‌ల‌లుగ‌న‌ని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు, అభిమానులు ఉంటారా?

థియేట‌ర్ ముందు… హౌస్‌ఫుల్ బోర్డు క‌నిపించిన క్ష‌ణం… ఓ ర‌క‌మైన సంతృప్తి. సినిమా జ‌యాప‌జ‌యాల‌కు అదో సంకేతం. మ‌రి… అలాంటి బోర్డులు భ‌విష్య‌త్తులో చూడ‌గ‌ల‌మా?

క‌రోనా మ‌హ‌మ్మారి సినిమాల్నీ, థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ల్నీ క‌బ‌ళిస్తోంది. ఇక మీద‌ట థియేట‌ర్ల ముందు తోపులాట‌లు క‌నిపించ‌కూడ‌దు. టికెట్ కౌంట‌ర్ల ముందు క్యూలు కూడా పాత ముచ్చ‌ట‌గానే మిగిలిపోతుంది. కిక్కిరిసిన థియేట‌ర్లు చూడ‌లేం. కార‌ణం క‌రోనా. థియేట‌ర్లు ఎప్పుడు తెరుస్తారా అంటూ చిత్ర‌సీమ యావ‌త్తూ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అయితే థియేట‌ర్లు తెర‌చుకున్నంత మాత్రాన – అన్ని స‌మ‌స్య‌ల‌కూ ప‌రిష్కారం దొరికిన‌ట్టు కాదు. అప్పుడే కొత్త స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. సీటు విడ‌చి సీటు.. అన్న‌ది కొత్త రూలు. అంటే… థియేట‌ర్ సిట్టింగ్ కెపాసిటీ వంద అయితే.. యాభై మంది ప్రేక్ష‌కుల‌కే అనుమ‌తి ఇవ్వాలి. అంటే హౌస్ ఫుల్ కాస్తా.. హౌస్ హాఫ్‌.. అయ్యింద‌న్న‌మాట‌. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ థియేట‌ర్లో స‌గం సీట్ల‌ని పీకేశారు కూడా. మిగిలిన థియేట‌ర్లూ ఇలానే ముస్తాబు కావాల్సివుంది.

సినిమా విడుద‌లై తొలి మూడు రోజుల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. నిర్మాత‌లకు, సినిమాకొన్న‌వాళ్ల‌కూ గిట్టుబాటు అయ్యేది ఆ మూడు రోజులే. వీక్ డేస్‌లో ఎలాగూ… థియేట‌ర్లు నిండ‌వు. రాత్రి ఆట‌ల‌కు త‌ప్ప‌. అలాంటిది.. ఇప్పుడు ఏ రోజూ థియేట‌ర్ల‌లో నిండుగా జ‌నం క‌నిపించ‌రు. ఇలాంటి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌ని న‌డ‌ప‌డం సాధ్య‌మా? అన్నది కొత్త ప్ర‌శ్న‌. ఆదాయం స‌గం అయిపోతున్న‌ప్పుడు భారీ రేట్లు పెట్టి, సినిమాల్ని కొన‌డానికి బ‌య్య‌ర్ ముందుకొస్తాడా? స‌గం థియేట‌ర్ అయినంత మాత్రాన‌… ఖ‌ర్చు త‌గ్గుతుందా? అదే అద్దె. అదే క‌రెంటు బిల్లు. పైగా ఇది వ‌ర‌క‌టికంటే ఎక్కువ శుభ్ర‌త పాటించాలి. షో కీ షోకీ మధ్య శానిటైజేష‌న్ చేయించాలి. అలాగ‌ని టికెట్ రేటు పెంచ‌డానికి ఏమాత్రం ఆస్కారం లేదు. పైగా.. టికెట్ రేట్లు బాగా త‌గ్గించాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో – స‌గం సీట్లు పీకేసిన థియేట‌ర్లో సినిమాని న‌డ‌పడానికి ఎవ‌రు ముందుకొస్తారు? ఈ ప్ర‌శ్న‌ల‌న్నీ నిర్మాత‌ల్నీ, పంపిణీదారుల్ని, ప్ర‌ద‌ర్శ‌న కారుల్నీ వేధిస్తున్న‌వే. అందుకే.. థియేట‌ర్లు ఇప్ప‌టికిప్పుడు తెర‌చుకున్నా, కొత్త సినిమాల్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ధైర్యం చేసే అవ‌కాశాలు త‌క్కువ‌న్న వాద‌న వినిపిస్తోంది. థియేట‌ర్ల‌కు ప‌ర్మిష‌న్లు ఇచ్చాక గానీ.. ఈ విష‌యంలోని అస‌లు లోటు పాట్లు అర్థం కావు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close