క్రిష్ బాట‌లో… వంశీ పైడిప‌ల్లి?

జ‌మానా మారింది. సినిమా త‌ర‌వాత మ‌రో సినిమా. మ‌ధ్య‌లో ఖాళీ. ఇది వ‌ర‌కు ద‌ర్శ‌కుల ప‌రిస్థితి అది. కానీ.. ఇప్ప‌టి ద‌ర్శ‌కులు వేరు. ఖాళీ అనే ప‌దానికి వాళ్ల డిక్ష‌న‌రీలో అర్థ‌మే లేదు. కాస్తంత టాలెంట్ ఉంటే చాలు బోలెడంత ప‌ని. ప్ర‌తీ అగ్ర ద‌ర్శ‌కుడూ.. యాడ్ల రూపంలో బాగానే సంపాదించారు. ఇప్పుడు ఓటీటీ వేదిక‌లు తోడ‌య్యాయి. అటు సినిమాటు – ఇటు ఓటీటీ అంటూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు కొంత‌మంది ద‌ర్శ‌కులు. వాళ్ల‌లో క్రిష్ ముఖ్యుడు. క్రిష్ యాడ్ల రంగంలోనూ బిజీ. క్రిష్ బాట‌లోనే మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడు.. త‌నే వంశీ పైడిప‌ల్లి.

రాశి కంటే వాశి ముఖ్య‌మ‌ని న‌మ్మే ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. అందుకే త‌న నుంచి త‌క్కువ సినిమాలొచ్చాయి. కానీ.. అన్నీ గుర్తుండిపోయేవే. మ‌హేష్‌తో `మ‌హ‌ర్షి` తీశాక‌.. త‌న‌కే మ‌రో క‌థ వినిపించాడు. అన్నీ ఓకే అనుకున్న స‌మ‌యంలో అది వ‌ర్క‌వుట్ కాకుండా పోయింది. మ‌హేష్ `నీతో సినిమా చేస్తా` అని భ‌రోసా ఇచ్చినా అది కార్య‌రూపం దాల్చ‌డానికి టైమ్ ప‌ట్టేట్టు ఉంది. అందుకే ఈలోగా ఓటీటీ వైపు దృష్టి సారించాడు వంశీ. త్వ‌ర‌లోనే ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడ‌ట వంశీ. అందుకు సంబంధించిన స‌న్నాహాలు సాగుతున్నాయి. ఓ వెబ్ సిరీస్‌లో వీలైనన్ని ఎపిసోడ్లు తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. మ‌రో వెబ్ సిరీస్‌కి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ఆహా టీమ్ తో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

HOT NEWS

[X] Close
[X] Close