తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు. దీంతో.. విజయ్ మాల్యా…భారత్‌ రావడం.. ఇప్పుడల్లా జరగదని తేలిపోయింది. కోర్టుల్లో మల్యా చివరి పోరాటం కూడా విఫలమవడంతో.. రెండు రోజుల క్రితం.. ఇక మాల్యాను.. ఇండియాకు పంపించడమే మిగిలిందన్న ప్రచారం జరిగింది. ఏ క్షణమైనా ఆయనను ఇండియాకు పంపిస్తారని చెప్పుకున్నారు. కానీ గంటలు గంటలు గడిచిపోయినా.. అలాంటి ప్రక్రియ ఏదీ ప్రారంభం కాలేదు. చివరికి బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను ఇండియాకు అప్పగించే ఆలోచన ఏదీ లేదని.. చెప్పడంతో.. మాల్యా ప్లాన్ బీ ఏదో పెట్టుకున్నారని.. దాన్ని అమలు చేశారని భావిస్తున్నారు.

భారత్‌లో బ్యాంకులకు విజయ్ మాల్యా రూ.పదకొండు వేల కోట్లకుపైగా బాకీ ఉన్నారు. ఆయన ఆస్తులన్నీ జప్తు చేశారు. అయితే..లండన్ పారిపోయిన ఆయన.. ప్రశాంతంగా జీవించేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. భారత ప్రభుత్వం.. విజయ్ మాల్యాను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అప్పగిస్తే ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి.. జైలుకు పంపాలని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ బ్రిటన్ మాత్రం చివరి క్షణంలో అడ్డు పుల్ల వేసింది. యూకే సుప్రీంకోర్టు కూడా.. మాల్యాను ఇండియాకు పంపడానికి అంగీకరించిన తర్వాత… ఇంకే న్యాయ అవకాశమూ మాల్యాకు లేదని భావించారు.

కానీ న్యాయపరమైన ఇష్యూస్ పరిష్కారం కావాల్సిందని బ్రిటన్ విదేశాంగ శాఖ చెబుతోంది. లోపాయికారీగా… విజయ్ మాల్యా… ఏదో ప్లాన్ అమలు చేసి ఉంటారని భావిస్తున్నారు. బ్రిటన్ అధికారుల స్పందన ప్రకారం చూస్తే..మాల్యాను.. ఇప్పుడల్లా ఇండియాకు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లండన్‌లో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ.. ఇలా.. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉండి కూడా.. విలాసవంత జీవితం గడుపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close