మీడియా వాచ్ : బిత్తిరి సత్తికి టీవీ9 గుడ్ బై..!

టీవీ9 ఇస్మార్ట్ న్యూస్‌ను తన భుజాలపై నడిపిస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఆ చానల్ నుంచి వైదొలిగారు. ఆయనను.. టీవీ9 యాజమాన్యమే తొలగించిందని చెబుతున్నారు. వీ6 చానల్‌లో తీన్మార్ న్యూస్ ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి వచ్చిన బిత్తిరి సత్తి.. చాలా కాలం పాటు ఆ కార్యక్రమాన్ని యాంకర్ శివజ్యోతికి కలిసి నిర్వహించారు. తీన్మార్ న్యూస్ అంటే.. బిత్తిరి సత్తి, శివజ్యోతి అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. వీ6 నుంచి వారు వివిధ కారణాలతో బయటకు వచ్చారు. శివజ్యోతి బిగ్ బాస్‌ షోకి వెళ్లగా.. బిత్తిరి సత్తి.. టీవీ9లో చేరారు. యాజమాన్యం మారిన తర్వాత టీవీ9కి మేకోవర్ ఇవ్వాలనుకున్న కొత్త టీం.. ఇస్మార్ట్ న్యూస్‌కు రూపకల్పన చేసింది. నేరుగా.. బిత్తిరి సత్తినే చేర్చుకోవడంతో.. ఆ ప్రోగ్రాం నిలబడుతుందని అనుకున్నారు.

తర్వాత శివజ్యోతిని కూడా చేర్చుకున్నారు. దాంతో.. తీన్మార్ న్యూస్ కన్నా.. ఇస్మార్ట్ న్యూస్ సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ తీన్మార్ న్యూస్‌ని బీట్ చేయలేకపోయింది. అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడానికి తోడు.. ప్రోగ్రామ్స్‌లో సొంత అజెండాను అమలు చేస్తున్నారన్న అభిప్రాయం… యాజమాన్యానికి వచ్చిందంటున్నారు. కంపెనీకి సంబంధం లేకుండా.. ఇతర ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేశారన్న కోపం.. యాజమాన్యంలో ఉందంటున్నారు. అదే సమయంలో.. ఫాదర్స్ డే రోజు.. బిత్తిరి సత్తి నిజంగా తన తండ్రి ఫోటోనే ఉపయోగించి స్కిట్ చేశారు. అది కూడా.. టీవీ9 యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అందుకే.. బయటకు పంపేశారని చెబుతున్నారు.

ఇది కాదు.. అసలు టీవీ9 కొత్త యాజమాన్యం తీరే భిన్నంగా ఉంటుందని… మొదట్లో భారీ జీతాలతో నియమించుకున్న వారిని ఇప్పుడిప్పుడే బయటకు పంపే ప్రయత్నం చేస్తోందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. బిత్తిరి సత్తి ఒక్క ప్రోగ్రామే చేస్తారు. ఇస్మార్ట్ న్యూస్ టీం బడ్జెట్‌కి… వస్తున్న రేటింగ్స్‌కు పొంతన ఉండటం లేదు. అందుకే..అన్ని రకాల అంచనాలు వేసుకుని… బిత్తిరి సత్తితో స్టార్ట్ చేశారని.. ముందు ముందు ఇంకా కొంత మంది ముఖ్యులకూ… డోర్ చూపిస్తారని చెబుతున్నారు. టీవీ9 కొత్త యాజమాన్యం వ్యాపార వ్యూహాల గురించి తెలిసిన వారు ఇది నిజం కావొచ్చని కూడా అంటున్నారు. మొత్తానికి బిత్తిరి సత్తి.. టీవీ9లో తన బ్రాండ్ చూపించకుండానే.. బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close