గౌత‌మ్ మీన‌న్‌కి ఇదే బాగున్న‌ట్టుంది

క్లాస్ ట‌చ్ ఉన్న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌. అయితే చాలా కాలంగా ఆయ‌న‌కు హిట్స్ లేవు. తీసింద‌ల్లా ఫ్లాపే. ఆయ‌న త‌న ట‌చ్ కోల్పోయి.. ఏదేదో తీస్తున్నాడు. అయితే… త‌న కెరీర్ ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. న‌టుడిగా.. పుష్క‌ల‌మైన అవ‌కాశాలొస్తున్నాయి. ఇటీవ‌లే ‘క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించారాయ‌న‌. ఆ పాత్ర‌కు మంచి పేరొచ్చింది. అప్ప‌టి నుంచీ ఆ త‌ర‌హా సీరియ‌స్ రోల్స్ గౌత‌మ్ మీన‌న్ ని వెదుక్కుంటూ వెళ్తున్నాయి. `ట్రాన్స్‌’ అనే మలయాళ చిత్రంలో విలన్‌గా న‌టించారు గౌత‌మ్‌. ఆ సినిమాలో న‌ట‌న‌కూ కితాబులు అందుకున్నాడు. అటు త‌మిళ‌, క‌న్నడ చిత్రాల నుంచి వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తెలుగులోనూ ఇలాంటి అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్నాడు గౌత‌మ్‌. కొంత‌మంది న‌టులు.. త‌ర‌వాతి కాలంగా ద‌ర్శ‌కులుగా మారి, అక్క‌డే బిజీ అయి, స్థిర‌ప‌డ‌తారు. కానీ ద‌ర్శ‌క‌త్వం నుంచి న‌ట‌న వైపుకొచ్చి, అందులో సెటిలైన‌వాళ్లు చాలా త‌క్కువ‌. కానీ.. గౌత‌మ్ ని చూస్తుంటే, న‌టుడిగా సెటిలైపోవ‌డానికి డిసైడ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.

“నాలో న‌టుడున్నాడ‌న్న సంగ‌తి నాకు నిజంగా తెలీదు. స‌ర‌దాగా కొన్ని ప్ర‌య‌త్నాలు చేశాను. అవ‌న్నీ నా మ‌న‌సుకి న‌చ్చాయి, ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చాయి. న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం ఏదైనా స‌రే, సినిమాలో భాగ‌మే క‌దా. అందుకే న‌ట‌న‌నీ ఆస్వాదిస్తున్నా” అంటున్నాడు గౌత‌మ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్… ప్రమాదంపై అనుమానాలు..!

ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది....

ఎన్టీఆర్… ఎందుకంత‌ స్పెషల్ ?!

నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన హీరో... రెండు దశాబ్దాల తర్వాత కూడా అగ్రపధంలో కొనసాగడం అంటే అదొక స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌ ప్రయాణంలానే చూడాలి. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్...
video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close