ఏపీ సర్కార్ కరెంట్ బిజినెస్‌..! సీతారామన్ చెప్పిన సీక్రెట్..!

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి రూ. 2.70 పైసలకే కరెంట్ ఇస్తోంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం ప్రజల వద్ద నుంచి రూ. 9 రూపాయలు వస్తోంది. అంటే.. కొనుగోలు.. అమ్మకానికి మధ్య మార్జిన్.. ఆరు రూపాయల 30 పైసల వరకూ ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయట పెట్టి.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా అమ్మితే ప్రజలు ఎలా విద్యుత్ బిల్లులు చెల్లిస్తారని ఆమె ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇప్పుడు.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ రంగం విషయంలో వైసీపీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి వివాదాస్పద నిర్ణయాలే చోటు చేసుకుంటున్నాయి. ఓ సారి విద్యుత్ చార్జీలు కూడా పెంచారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో చేసుకున్న పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో ఏపీ సర్కార్.. చట్టాలు.. కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా.. వాటిని రద్దు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. అయితే.. ఈ వివాదాల కారణంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు దెబ్బతిన్నాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపింది. ఈ వివాదంపై.. కేంద్రం.. రెండు, మూడు సార్లు ఏపీ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ.. లేఖలు కూడా పంపింది. అయితే.. ఏపీ సర్కార్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు కొత్తగా నిర్మలా సీతారామన్.. కేంద్రం వద్ద.. కొని.. వినియోగదారులకు.. చాలా ఎక్కువ మొత్తానికి అమ్ముతూ.. ప్రజల్ని దోపిడీ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం.. చర్చనీయాంశం అవుతోంది

రెండో విడత మోడీ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా.. వర్చువల్ ర్యాలీలను మోడీ సర్కార్ నిర్వహిస్తోంది. ఏపీలోనూ ఇలాంటిని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. ఏపీకి కేంద్రం ఏమేం చేసిందో వివరించారు. ఏపీలో 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.936.16 కోట్లు వేశామని వెల్లడించారు. మత్స్య సంపద యోజన కింద దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఇచ్చామని, ఆక్వా, మెరైన్‌ ఫిషింగ్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించామని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి కోవిడ్‌ ఫైట్‌ కింద రూ.8025 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close