రూపాయికే పంటల బీమా..! రైతులకు మరో వరం..!

విత్తనాలు మొలకెత్తకపోవడం.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం.. సహా ఓ రైతు పంట చేతికి వచ్చే సరికి అనే గండాలను ఎదుర్కోవాలి. ఈ మధ్యలో పంట నష్టపోతే… పట్టించుకునేవారు ఉండరు. పంటల బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రైతులను ఆదుకుంటున్నది అంతంత మాత్రమే. బీమా ప్రీమియం చెల్లించలేకపోవడం.. వివిధ రకాల ఆంక్షలు… షరుతులు కారణంగా.. రైతులకు పరిహారం దక్కేది కాదు. అయితే.. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్.. కొత్తగా ఆలోచించారు. రైతులకు ఒక్క రూపాయికే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. కేంద్రం ఫసల్ బీమా యోజనను అమలు చేస్తోంది. ఈ పథకాన్ని పూర్తిగా ప్రభుత్వం అడాప్ట్ చేసుకుని.. రైతుల తరపున చెల్లించాల్సిన సొమ్మును కూడా చెల్లించాలని జగన్ నిర్ణయించారు. రైతులు ఒక్క రూపాయి చెల్లిస్తే.. సరిపోతుంది.

ఏపీలో ఉన్న దాదాపు అరవై లక్షల మంది రైతులకు ఉచిత బీమా పథకాన్ని వర్తింప చేస్తున్నారు. కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో రైతులు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే అన్ని పంటలకూ ప్రభుత్వం నిర్ణయించిన బీమా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ కంపెనీకి ప్రీమియం చెల్లిస్తుంది. బ్యాంకుల ద్వారా లోన్‌ తీసుకునే రైతులకు కట్‌ అయిన బీమా ప్రీమియం నగదు సైతం తిరిగి చెల్లించింది. ఈ మేరకు నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఐదున్నర లక్షల మంది రైతుల అకౌంట్లలో ఆ నిధులు జమ అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఖరీఫ్‌ 2016 నుండి అమలుజరుగుతోంది. అయితే రైతులు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. 2019 నుండి రైతులందరి తరుపున పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది.ఈ సీజన్‌లో ఇప్పటికే బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు కూడా వారు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు తిరిగి చెల్లించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు కేవలం ఒక రూపాయి నమోదు కోసం చెల్లించి, నిర్ధేశించిన గడువులోగా రైతులు తమ పంటలకు బీమా చేసుకోవచ్చు. ప్రభుత్వమే బీమా కంపెనీలతో టై అప్ అయి.. రైతులకు నష్టపరిహారం అందిస్తుంది. ఓ రకంగా ఈ పథకం రైతులకు బాగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close