అప్పులతోనే నడుస్తున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల మీదనే బండి నడిపించాలని నిర్ణయించుకుంది. వచ్చే మూడు నెలలకు మరో రూ. 14వేల కోట్ల అప్పు కావాలంటూ.. ప్రతిపాదనలను ఆర్బీఐకి సమర్పించింది. ఇప్పటికే మూడు నెలల్లో రూ. 15వేల కోట్ల అప్పును ప్రభుత్వం బాండ్ల రూపంలో సమీకరించింది. వచ్చే మూడు నెలలకు నెలకు.. రూ. ఐదు వేల కోట్లు కావాలని తాజాగా లెక్కలేసుకుంది. కరోనా వైరస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు.. ఆదాయం పడిపోవడంతో.. రుణాలు తీసుకోవడంలో… రాష్ట్ర ప్రభుత్వాలకు పరిమితిని కేంద్రం పెంచింది. అప్పుల విషయంలో.. చాలా దూకుడుగా ఉంటున్న ఏపీ సర్కార్‌కు ఈ అవకాశం.. అంది వచ్చింది. ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుని అప్పుల కోసం పరుగులు పెడుతోంది.

బడ్జెట్‌లో పెట్టిన ప్రతిపాదనల కంటే ఎక్కువగా అప్పులు తీసుకు వస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.54,257 కోట్లను అప్పుగా తీసుకుంటామని ప్రతిపాదించారు. తొలి మూడు నెలల్లోనే 15వేల కోట్లు.. తర్వాత మరో మూడు నెలల్లో మరో 14వేల కోట్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా అప్పులు తీసుకుంటూ వెళ్తే.. అది అరవై వేల కోట్లు దాటిపోతుంది. అంటే అప్పుల్లో బడ్జెట్ లెక్కలనూ అధిగమిస్తారన్నమాట. అయితే.. ఇవన్నీ ప్రభుత్వాన్ని నడపడానికి.. అవసరమైన అప్పులు మాత్రమే. అప్పులుగా ఈ నిధులను తీసుకు వస్తున్న ఏపీ సర్కార్.. జీతాలు.. పెన్షన్లు… ఇతర పథకాలకు నగదు పంపిణీ రూపంలో మళ్లిస్తోంది.

బడ్జెట్‌లో పెట్టిన అప్పులు.. తీసుకుంటున్న రుణాలు.. కేవలం.. బహిరంగ మార్కెట్ రుణాలు. నేరుగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు. ఇక ప్రభుత్వం.. వివిధ రకాల ప్రాజెక్టులు.. ఎస్పీవీలు ఏర్పాటు చేసి.. మరికొన్ని వేల కోట్లు తీసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. విద్యుత్ సంస్థలతో పాటు.. సాగునీటి ప్రాజెక్టులనూ కూడా.. ప్రత్యేక సంస్థలుగా మార్చి… కార్పొరేషన్ల కింద రుణాలుగా తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తోంది. అభివృద్ధి పనులన్నింటికీ అప్పులు తెచ్చుకోవాలని సీఎం జగన్ అధికారులను సమీక్షలు జరిపినప్పుడల్లా ఆదేశిస్తున్నారు. దీంతో… ఏపీ సర్కార్.. ఆదాయం పెంపుదలపై పూర్తిగా దృష్టి తగ్గించి.. అప్పులతో ఎంత కాలం నడిస్తే.. అంత కాలం నడిపించాలని అనుకుంటున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close