‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ – సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా ‘పుష్ష‌’. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ స్థానంలో బాబీ సింహా వ‌చ్చి చేరాడు. విజ‌య్ సేతుప‌తి రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేక త‌న‌ని ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పించార‌న్న టాక్ న‌డుస్తోంది. మ‌రికొంత‌మందైతే, ఈ సినిమాని త‌మిళంలో కూడా విడుద‌ల చేయ‌డం విజ‌య్‌కి ఇష్టం లేద‌ని, ఎందుకంటే త‌మిళంలో హీరో ఇమేజ్ ఉన్న త‌న‌పై ఈ త‌ర‌హా పాత్ర‌లు నెగిటీవ్ రిజ‌ల్ట్ ని తీసుకొచ్చే ప్ర‌మాదం ఉంద‌ని విజ‌య్ భావించాడ‌ని… చెప్పుకుంటున్నారు.

అయితే వీటిపై విజ‌య్ సేతుప‌తి ఇప్పుడు స్పందించాడు. కేవ‌లం కాల్షీట్ల స‌మ‌స్య‌తోనే ఈ సినిమా నుంచి తాను త‌ప్పుకున్నాన‌ని, చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ఈ టీమ్ తో క‌ల‌సి ప‌నిచేయాల‌ని భావించాన‌ని, కానీ కుద‌ర్లేద‌ని చెప్పుకొచ్చాడు. ఈ క‌థ‌, అందులోని త‌న పాత్ర బాగా న‌చ్చాయ‌ని, కానీ… ఇది వ‌ర‌కే ఒప్పుకున్న సినిమాల వ‌ల్ల‌, పుష్ష నుంచి అయిష్టంగానే త‌ప్పుకోవాల్సివ‌చ్చింద‌న్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌న్న న‌మ్మ‌కం వ్య‌క్తం చేశాడు. సుకుమార్ డైరెక్ష‌న్ లో విజ‌య్ చేయ‌క‌పోయినా, నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ‘ఉప్పెన‌’లో విజ‌య్ విల‌న్ గా న‌టించేశాడు. ఆ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close