“టిమ్స్” ప్రారంభం .. కాని రోగుల్ని చేర్చుకోరు..!

తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెన్స్‌గా కేసీఆర్ నామకరణం చేసిన ఆస్పత్రి … ఎట్టకేలకు ప్రారంభమయింది. అదిగో.. ఇదిగో అంటూ.. మూడు నెలల నుంచి ఆ ఆస్పత్రి గురించి చెబుతూనే ఉన్నారు. కానీ ప్రారంభించలేకపోయారు. ఎట్టకేలకు ప్రారంభించారు. మొదటగా.. కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న ఓ పేషంట్‌ను చేర్చుకున్నారు. ఇతర కేసుల్ని మాత్రం చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. అంటే.. టిమ్స్‌ను ప్రారంభించారు కానీ.. అందులో ఒక్కరంటే.. ఒక్కర్ని చేర్చుకున్నారన్నమాట. వచ్చిన వారందరికీ.,. హోం ఐసోలేషన్‌కి ప్రిఫర్ చేస్తూ.. వెనక్కి పంపేస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న అత్యధిక కేసులు లక్షణాలు లేకపోవడం లేదా.. స్వల్ప లక్షణాలు ఉన్నవే కావడంతో.. టిమ్స్ వైద్యులు.. హోం ఐసోలేషన్ కు ప్రిఫర్ చేసేస్తున్నారు.

అయితే… కరోనా రోగుల్ని చేర్చుకోకపోవడానికి సిబ్బంది లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉందంని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా… వైద్యులు.. వైద్య సిబ్బంది కొత్తగా విధుల్లో చేరేందుకు దొరకడం లేదు. ఇప్పటికే వివిధ ఆస్పత్రుల్లో సిబ్బంది తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఆయా చోట్ల నుంచి టిమ్స్‌కు.,. సిబ్బందిని బదిలీ చేస్తే.. అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే.. కొత్తగా నియమించుకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ.. నియమించుకోవాలనున్నదాంట్లో.. ఇరవై శాతం మందిని కూడా నియమించుకోలేకపోయారు. వారికి కూడా.. కరోనా చికిత్సపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో పది శాతం రోగుల్ని కూడా.. ఆస్పత్రికి తరలించడం లేదు. ఎక్కువగా ఇంట్లోనే చికిత్స పొందమని సలహా ఇచ్చి పంపేస్తున్నారు. ఫలితంగా.. దాదాపుగా అన్ని ఆస్పత్రుల్లోనూ… బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. పైకి మాత్రం.. బెడ్లు ఖాళీ లేవని.. ఇంట్లోనే చికిత్స పొందాలని సూచిస్తున్నారు. అధికారిక లెక్కలంటూ.. 70 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న వివరాలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు టిమ్స్ విషయంలోనూ అదే జరుగుతోంది. టిమ్స్‌ను ప్రారంభించామని.. మీడియాకు… సమాచారం ఇచ్చారు కానీ.. అందులో పేషంట్లను చేర్చుకోవడం లేదు. తెలంగాణ సర్కార్.. కరోనా టెస్టింగ్ .. ట్రేసింగ్ ను పట్టించుకోవడం లేదని… ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.. ట్రీట్‌మెంట్ విషయంలోనూ.., అంతే ఉందని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయన్న విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close