కేసీఆర్ మాటే రైతుల బాట..! చెప్పిన పంటే వేశారు..!

నియంత్రిత వ్యవసాయం అంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విధానంపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. కానీ.. రైతులు మాత్రం.. అవేమీ పట్టించుకోలేదు. కేసీఆర్ .. తమ మంచి కోసమే చెబుతారని నమ్మారు. అందుకే.. వంద శాతం నియంత్రిత వ్యవసాయంలోకి వచ్చారు. తాము వేయాలనుకున్న పంట కాకుండా.. ప్రభుత్వం సూచించిన పంటనే వేశారు. ఫలితంగా.. ఈ ఏడాది తెలంగాణలో పండబోతున్న పంటల్లో అనూహ్యమైన మార్పు కనిపించబోతోంది. ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంటుందో ఏ పంట తెలంగాణ అవసరాలకు ఎంత వరకు అవసరమో.. అంచనా వేసి..అంత మేరకు.. మాత్రమే.. పంటల సాగుకు.. అధికారులకు రైతులు దిశానిర్దేశం చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది సాగు పెరిగినా… వివిధ రకాల పంటలు.. అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మక్కలకు మద్దతు ధర చాలా సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది. మొక్కజొన్నకు డిమాండ్ తక్కువగా ఉండటం.. పంట ఎక్కువగా పండుతూండటంతో.. సమస్య వచ్చేది. ఈ సారి మాత్రం.. డిమాండ్ కు తగ్గట్లుగా మాత్రమే పంటను.. పండించేలా రైతుల్ని ఒప్పించారు. గత ఏడాది ఐదు లక్షల 27వేల ఎకరాల్లో మకల సాగు చేశారు. కానీ ఈ ఏడాది కేవలం లక్షా 23వేల ఎకరాలకే పరిమితం చేశారు. మామూలుగా రెండు సీజన్లలో కలిపి 11 లక్షల ఎకరాల్లో రైతులు మక్కల సాగు చేస్తారు. ఈ సారి ప్రభుత్వ సూచనలతో… పంటను తగ్గించడంతో.. మద్దతు ధరకుఢోకా ఉండదు. అధిక ఉత్పత్తికి అవకాశం లేదు. దీంతో రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. అలాగే కంది సాగు విస్తీర్ణం తక్కువగా ఉండేది.. ఇప్పుడు.. కనీసం మూడు లక్షల ఎకరాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీని వల్ల కొరత తీరనుంది.

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం.. ప్రాజెక్టుల్లో నీరు ఉండటంతో.. భూగర్భ జలాలు పెరగడం వంటి కారణంగా.. అంచనా వేసిన దాని కన్నా ఎక్కువగా పంటలు సాగుతున్నాయి. అయినప్పటికీ..ప్రభుత్వం.. అందరికీ.. నియంత్రిత సాగులో.. ఏ ఏ పంటలు వేయాలో.. స్పష్టమైన సూచనలు చేసింది. అలా వేసిన వారికే.. రైతు బంధు ఇస్తామని చెప్పినప్పటికీ…దానితో సంబంధం లేకపోయినా.. రైతులు.. ప్రభుత్వ సూచనలకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం కూడా.. రైతు బంధు ఎవరికీ ఎగ్గొట్టలేదు. అందరికీ వర్తింప చేసింది. ఈ ఏడాది తెలంగాణ వ్యవసాయ రంగంలోకి కీలకమైన మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close