దిల్ రాజు.. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా

చిన్న సినిమాల‌తో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రయాణం మొద‌లైంది. క్ర‌మంగా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. టాలీవుడ్ లోని టాప్ హీరోలంద‌రితోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే… ఈ బ్యాన‌ర్ నుంచి ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా రాలేదు. ఆ లోటు ఇప్పుడు తీర్చుకోబోతున్నారు దిల్ రాజు.

దిల్ రాజు సంస్థ నుంచి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా రాబోతోంది. ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో మంచి విజ‌యాల్ని అందించిన ఓ ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కిస్తారు. ఓ అగ్ర క‌థానాయిక ఈ చిత్రంలో న‌టించ‌బోతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ కోస‌మా? థియేట‌రిక‌ల్ రిలీజ్ కోస‌మా? అనేది తెలియాల్సివుంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు, బ‌డ్జెట్ లెక్క‌లు జ‌రుగుతున్నాయి. అవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చాకే ఈ సినిమా స్థాయి ఏమిటో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close