‘ఆచార్య’ అక్క‌డ ఆగింది

చిరు 152వ చిత్రం `ఆచార్య‌`. అన్నీ స‌జావుగా సాగితే.. ఈపాటికి సినిమా పూర్త‌య్యేది. కానీ క‌రోనా వ‌ల్ల ఆగిపోయింది. లాక్ డౌన్ నిబంధ‌న‌ల్ని స‌డ‌లించిన త‌ర‌వాత‌.. షూటింగులుకు అనుమ‌తి ఇచ్చాక‌.. `ఆచార్య‌`ని ప‌ట్టాలెక్కిద్దాం అనుకున్నారు. కానీ.. కుద‌ర్లేదు. మ‌ళ్లీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదు. అయితే.. ఆచార్య షూటింగ్ ఎక్కడి వ‌ర‌కూ జ‌రిగింది? ఎక్క‌డ ఆగింది? అనే విష‌యాల‌పై మాత్రం ఇప్పుడు స్ప‌ష్ట‌త వ‌చ్చింది.

ఆచార్య కోసం ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు ఫైట్స్ పూర్తి చేశారు. ఈ మూడు ఫైట్స్‌కీ రామ్ – ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్లు తెరకెక్కించారు. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు.. క‌రోనా వ‌ల్ల షూటింగ్ ఆపేశారు. దాదాపు 30 శాతం టాకీ పూర్త‌యింది. ఓ పాట కూడా తెర‌కెక్కించార‌ని తెలుస్తోంది. `ఆచార్య‌` షూటింగ్ ఎప్పుడు మొద‌లెట్టినా.. మ‌ధ్య‌లో ఆపేసిన ఇంట్ర‌వెల్ ఫైట్ ద‌గ్గ‌ర నుంచే శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార్ట‌. వాక్సిన్ వ‌చ్చేంత వ‌ర‌కూ.. అగ్ర హీరోలు సెట్స్‌పైకి వెళ్లే ధైర్యం చేయ‌రు. సో.. ఆచార్య మ‌ళ్లీ ప‌ట్టాలెక్కాలంటే… వాక్సిన్ కోసం ఎదురు చూడ‌డం త‌ప్ప‌, మ‌రో మార్గం లేన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close