సంజయ్ కొత్త టీమ్ కేసీఆర్‌ను ఎదుర్కొనేలా ఉందా..!?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… తన కొత్త టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అనే గట్టి నమ్మకంతో ఉన్న కమలనాథులు… ఈ మేరకు కసరత్తు చేసి మరీ.. ఓ కమిటీని నియమించారు. ఎనిమిది మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఆరుగుపు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీకి అంతో ఇంతో బలం ఉన్న ప్రాంతాల నుంచే ఎక్కువగా పదవులు కట్టబెట్టారు. మొత్తం 22 మందితో తన టీమ్‌ను రూపొందించారు బండి సంజయ్. అయితే.. ఈ టీమ్‌తోనే కేసీఆర్‌ను ఎదుర్కొంటారా.. అన్న పెదవి విరుపులు మాత్రం… ఆ పార్టీలోనే వినిపించడం ప్రారంభించాయి.

తెలంగాణలో బీజేపీ .. కేంద్రంలో అధికారం ఉందనే మానసిక బలంతో …. నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. దాంతో బీజేపీది అంతా పై పై హడావుడే అని అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ సీట్లు గెలవడంతో… మరోసారి ఊపు వచ్చింది. ఆ సీట్లు ఎలా వచ్చాయో.. ఆ పార్టీ నేతలకే అర్థం కాలేదు కానీ… తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ ఎప్పట్లానే నీరసపడిపోయారు. లోక్‌సభ సీట్లు గెలిచిన నిజామాబాద్, కరీంనగర్‌లలో కూడా.. అంతంతమాత్రమే ప్రభావం చూపించారు.

ఓటర్లు ఎన్నికలను బట్టి అంశాల వారీగా… ఓట్లు వేస్తున్నట్లుగా తేలింది. లోక్ సభ ఎన్నికల్లో.. మోడీకి జనం మద్దతిచ్చారు. కానీ ఆ స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి ప్రజల మద్దతు లభించడం లేదు. ఇప్పుడు బండి సంజయ్.. ఈ సవాల్‌ను అధిగమించాల్సి ఉంది. తన నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లోనే కాదు.. ప్రజల్లోనూ నమ్మకం కలిగిస్తేనే.., పార్టీ బలపడుతుంది. లేకపోతే.. ఎప్పట్లాగే.. అసెంబ్లీ.. స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు రాని పార్టీగా మిగిలిపోతుంది. నిన్నామొన్నటిదాకా బీజేపీని కాస్త ప్రమాదకరంగా చూసిన టీఆర్ఎస్ ఇప్పుడు… మళ్లీ.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది. తాము పట్టించుకోగలగిన రాజకీయ శక్తే అని నిరూపించాలంటే… బీజేపీ తెలంగాణ నాయకత్వం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close