రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపునకు అష్టకష్టాలు పడిన సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి చాలా చర్చలు బయట జరుగుతున్నాయి కానీ.. అసలు వాస్తవం ఏమిటో బయటకు తెలియడం లేదు. జీతాలు, ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సిన సమయంలో… ఆర్థిక కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్బీఐలో బాండ్ల వేలం వేసే వరకూ… ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయారు. రూ. రెండు వేల కోట్లు అలా అప్పు తీసుకుని జీతాలు సర్దేశారు. అయితే.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు మాత్రం ఇవ్వలేదు. ప్రభుత్వానికి రోజువారీగా వచ్చే ఆదాయం.. ఇతర మార్గాల ద్వారా సమీకరిస్తున్న నిధులతో..పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. గురువారానికి ఇలా 70 శాతం మందికి ఇచ్చారు. మిగిలిన 30 శాతం మందికి ఇవ్వలేదు.

రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా తమ పెన్షన్ల మీదనే జీవనం సాగిస్తూంటారు. ఒక్క రోజు ఆలస్యమైనా వారికి ఇబ్బందే. అయితే ప్రభుత్వం మాత్రం.. అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. తమ దగ్గర ఉన్నప్పుడు ఇస్తూ పోతోంది. పెన్షనర్లు ఈ విషయంపై ఆందోళన చెందుతూంటే.. ఉద్యోగ సంఘాల నేతలు.. పెన్షనర్ల సంఘాల నేతలు..ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేందుకు పరుగులు పెడుతున్నారు. పెన్షన్లు ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు వచ్చాయని… 70 శాతం మందికి పంపిణీ చేశారని.. మిగిలిన వారికి ఒకటి రెండు రోజుల్లో ఇస్తారని ప్రెస్‌నోట్‌లు రిలీజ్ చేస్తున్నారు . సాంకేతిక సమస్య వస్తే అందరికీ రావాలి కానీ.. కొంత మందికే ఎలా వస్తుందన్న సందేహం అందరికీ వస్తుంది.

ఏ ప్రభుత్వం ఉన్నా.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను.., ఒకటో తేదీన ఇవ్వడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఎందుకంటే.. అలా ఇవ్వకపోతే.. ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరిలోనూ అనుమానం ప్రారంభమవుతుంది. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. గత నెలలో ఎనిమిదో తేదీన అందాయి. ఈ నెల ఐదో తేదీ తర్వాత అందాయి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరించకపోతే.. మరిన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close