ఆ టైటిల్ త్రివిక్ర‌మ్ దేనా?

క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన చిత్రం `ల‌వ్ మాక్‌టైట్‌`. తెలుగులో ఈ చిత్రాన్ని స‌త్య‌దేవ్, త‌మ‌న్నాల‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో `గుర్తుందా శీతాకాలం` అనే పేరు పెట్టారు. టైటిల్ చాలా రొమాంటిక్‌గా, క్లాసిక్ ట‌చ్‌తో ఉండ‌డంతో.. మంచి స్పందన ల‌భించింది. నిజానికి ఈ టైటిల్ త్రివిక్ర‌మ్ త‌న సినిమా కోసం అట్టి పెట్టుక‌న్న‌ద‌ట‌. ఇది వ‌ర‌కే ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఈ టైటిల్ ని త్రివిక్ర‌మ్ రిజిస్ట‌ర్ చేయించుకున్న‌ట్టు స‌మాచారం.

అయితే `ల‌వ్ మాక్ టైట్‌` నిర్మాత‌ల‌కూ ఇదే టైటిల్ న‌చ్చింది. త‌మ సినిమాకి ఈ టైటిల్ అయితే బాగుంటుంద‌ని భావించ‌డంతో.. అదే ఖాయం చేశారు. ఈ టైటిల్ కోసం స‌త్య‌దేవ్ త్రివిక్ర‌మ్ ని సంప్ర‌దించాడ‌ని, త్రివిక్ర‌మ్ ఈ టైటిల్ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. `అత్తారింటికి దారేది`లో ఓ చిన్న పాత్ర పోషించాడు స‌త్య‌దేవ్‌. అప్ప‌ట్లో హీరోగా ట్రై చేస్తున్నా… త్రివిక్ర‌మ్ అడ‌గ‌డంతో కాద‌న‌లేక.. ఒప్పుకున్నాడు. `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`లోనే `శీతాకాలం సూర్యుడిలా కొంచెం కొంచెం చూస్తావే` అనే పాట ఉంది. ఈ లైన్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాడ‌ట త్రివిక్ర‌మ్‌. ఇప్పుడు అది స‌త్య‌దేవ్ కోసం ఇచ్చేశాడు. త్రివిక్ర‌మ్‌కి టైటిళ్ల కొర‌తా ఏంటి??!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close