జె.ఎన్.టి.యూ.కార్యక్రమానికి ఉగ్రవాది మద్దతు ఉంది: రాజ్ నాద్ సింగ్

ముంబై 26/11 ప్రేలుళ్ళ సూత్రధారులలో ఒకడయిన అఫ్జల్ గురు మూడేళ్ళ క్రితం ఉరితీయబడ్డాడు. డిల్లీలోని జె.ఎన్.టి.యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు ఫిబ్రవరి 9న అతని మూడవ వర్ధంతిని కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ పై దాడికి పాల్పడి, అనేకమంది ప్రాణాలు పోవడానికి కారకుడయిన ఒక ఉగ్రవాదికి దేశ రాజధాని డిల్లీలోనే కొందరు విద్యార్ధులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులు అర్పించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులపై కేసులు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నిన్న దృవీకరించారు. “జె.ఎన్.టి.యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ మద్దతు ఉంది. ఆతని ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం నిర్వహించబడినట్లు మావద్ద ఆధారాలున్నాయి. విద్యార్ధులే ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం చాలా దురదృష్టకరం. హఫీజ్ సయీద్ మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహించిన విద్యార్ధులపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని నేను ఆదేశాలు జారీ చేసాను. దీనితో సంబంధంలేని విద్యార్ధుల జోలికి వెళ్ళవద్దని అధికారులను గట్టిగా హెచ్చరించాను. దేశ ప్రజలందరూ దేశ వ్యతిరేక కార్యక్రమాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాలి,” అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కన్నయ్య కుమార్ తో బాటు కొందరు విద్యార్ధులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసారు. వామపక్షాల నేతలు కొందరు హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కలిసి విద్యార్ధులను విడిచిపెట్టాలని కోరగా అందుకు ఆయన నిరాకరించారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న వారిని వెనకేసుకొని రావద్దని వారికి హితవు పలికారు. ఆ విద్యార్ధుల సంగతి న్యాయస్థానాలు చూసుకొంటాయని, ఈ వ్యవహారంలో ఇక తను జోక్యం చేసుకొన్ని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, వామ పక్షాలు విద్యార్ధులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి జె.ఎన్.టి.యూనివర్సిటీకి వెళ్లి విద్యార్ధులకు సంఘీభావం తెలపడాన్ని రాజ్ నాద్ సింగ్ తప్పు పట్టారు. “దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నవారికి రాహుల్ గాంధి సంఘీభావం తెలుపుతున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగ్రవాదుల విగ్రహాలు ఆవిష్కరించుకొంటే బాగుంటుందేమో?” అని ఎద్దేవా చేసారు. దేశ వ్యతిరేక చర్యలను గట్టిగా ఖండించకపోగా దానిని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించడం చాలా దురదృష్టకరమని రాజ్ నాద్ సింగ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close