సీబీఐ విచారణ కావాలంటే పార్లమెంట్‌లో ధర్నాలెందుకు..!?

పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న మహాత్ముని విగ్రహం వద్ద వైసీపీకి ఉన్న పాతిక మంది ఎంపీలూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారి ప్లకార్డులపై మాత్రం భిన్నమైన నినాదాలున్నాయి. అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలనేది ఆ ప్లకార్డులపై డిమాండ్లు ఉన్నాయి. అందరు ఎంపీలు తమ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ఆందోళనలు చేస్తూంటే.. వీరు మాత్రం..సీబీఐ విచారణ కోరడం ఏమిటన్న చర్చ ఇతర పార్టీల ఎంపీల్లో జరిగింది. సీబీఐ విచారణలు.. ఇతర అంశాల కోసం.. ధర్నాలు చేయడం అరుదు. అదీ కూడా రాష్ట్ర అంశాలపై ఎవరూ ధర్నాలు చేసి సమయం వృధా చేసుకోరు.

సహజంగా సీబీఐ విచారణలు కావాలంటే.. ఎవరైనా ఆధారాలతో కేంద్రానికి సిఫార్సు లేఖ రాస్తారు. పైగా ఏపీ సర్కార్‌కు ఈ ప్రాసెస్‌ మీద స్పష్టమైన అవగాహన ఉంది. అధికారంలోకి రాగానే…గురజాలలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఓ కేసును అలాగే సీబీఐకి సిఫార్సు చేసింది. ఆ కేసు విషయంలో సీబీఐ విచారణ కూడా ప్రారంభించింది. ఒక వేల అలా సిఫార్సు చేసిన తర్వాత కేంద్రం స్పందించకపోతే కోర్టుకు వెళ్లే ఆప్షన్ ఉండనే ఉంది. ఆధారాలతో సహా కోర్టులో పిటిషన్ వేస్తే.. న్యాయస్థానమే చూసుకుంటుంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో జరిగింది అదే. అన్ని ఆధారాలతో కోర్టులో ప్రైవేటు వ్యక్తులు పిటిషన్ వేసినా… విచారణకు ఆదేశించింది. ఇక్కడ అధికారపార్టీగా ఉన్నప్పటికీ.. వైసీపీ ఎంపీలు తమ ఎదుట ఉన్న ఆప్షన్స్‌ను పట్టించుకోకుండా… పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తూ విచారణల డిమాండ్ చేస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్నిపార్టీల అధినేతలు సమావేశం పెట్టి..ఓ ఎజెండా సెట్ చేసి పంపిస్తారు. రాష్ట్రం కోసం ఏ ఏ అంశాలపై గళమెత్తాలో చెబుతారు. వైసీపీలో అలాంటి సమావేశాలేమీ జరగవు. పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన రోజున జగన్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారని .. ప్రత్యేక హోదా దగ్గర్నుంచి జీఎస్టీ బకాయిల వరకూ అన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీయమన్నారని ఎంపీలు చెప్పుకొచ్చారు. తీరా సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎంపీలు.. అమరావతి భూములపై సీబీఐ విచారణ పాట పాడుతున్నారు. ఈ అంశం కేంద్రం పరిధిలో లేదు.. కేవలం తమ మాటలు రికార్డులకు ఎక్కితే చాలన్నట్లుగా ఎంపీల తీరు ఉందనే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close