త‌మ‌న్నాకి తొలి ప‌రీక్ష‌

హ్యాపీ డేస్ నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ‌న్నా చేసిన‌వ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే. ఫ‌క్తు క‌థానాయిక పాత్ర‌లే. కాక‌పోతే… 100%ల‌వ్‌, కొంచెం ఇష్టం – కొంచెం క‌ష్టం లాంటి సినిమాల్లో త‌న పాత్ర‌ల‌కు మంచి మైలేజీ వ‌చ్చింది. ఆ పాత్ర‌ల్నీ కూడా ఈజీగా మంచి ఈజ్ తో చేసేసింది త‌మ‌న్నా. అయితే తొలిసారి త‌మ‌న్నాకు ప‌రీక్ష ఎదురవ్వ‌బోతోంది. ట‌బు రూపంలో.

`అంధాధూన్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న‌ప్పుడు అంద‌రిలో మెదిలిన ఏకైన ప్ర‌శ్న‌… `ట‌బు పాత్ర కోసం ఎవ‌రిని తీసుకుంటున్నారు` అనే. ఎందుకంటే… `అంధాధూన్‌`కి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌, బ‌లం.. ట‌బు పాత్రే. ఆ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు మ‌లుచుకున్న విధానం, అందులో ట‌బు రాణించిన ప‌ద్ధ‌తి ఆ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాయి. దాంతో ట‌బుని ఎవ‌రితో రిప్లేస్ చేస్తారా? అనే ప్ర‌శ్న మొద‌లైంది. న‌య‌న‌తార ద‌గ్గ‌ర్నుంచి శ్రియ వ‌ర‌కూ.. అటు తిరిగి ఇటు తిరిగి – చివ‌రికి త‌మ‌న్నా ద‌గ్గ‌ర ఆగింది చిత్ర‌బృందం. నిజానికి ఈ పాత్ర‌లో త‌మ‌న్నాని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌మ‌న్నా రాక‌తో.. ఈ సినిమాకి స్టార్ మైలేజీ అయితే వ‌చ్చింది. కానీ… ట‌బుని ఎంత వ‌ర‌కూ మర‌పిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌.

త‌మ‌న్నాకి ఉన్న ఇమేజ్ వేరు. ఆమె గ్లామ‌ర్ తార‌. న‌టించ‌గ‌ల‌దు కూడా. కాక‌పోతే.. ట‌బు పాత్ర లో ఎక్కువ‌గా నెగిటీవ్ షేడ్స్ ఉంటాయి. క‌న్నింగ్ స్వ‌భావం. వాటిని ట‌బు బాగా పండించింది. ఈ రెండూ… త‌మ‌న్నాకి కొత్తే. పైగా త‌మ‌న్నా వ‌ల్ల ఈ పాత్ర‌ని ఏమైనా మార్చేస్తారా? అనే భ‌యాలు మొద‌ల‌య్యాయి. ఎందుకంటే.. త‌మ‌న్నా క‌చ్చితంగా భారీ పారితోషికాన్నే డిమాండ్ చేసి ఉంటుంది. అమెని వీలైనంత వాడుకోవడం ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌ని. అందుకే.. త‌మ‌న్నా కోసం ఆ పాత్ర నిడివి మ‌రింత పెంచే అవ‌కాశం ఉంది. పైగా త‌మ‌న్నా మంచి డాన్స‌ర్‌. త‌న కోసం ఓ పాట‌ని ఇరికించినా ఇరికించేస్తారు. ఇవ‌న్నీ ఆ పాత్ర స్వ‌భావాన్ని చెడ‌గొట్ట‌కుండా ఉంటాయా? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ట‌బు పాత్ర‌లో మార్పులు చేర్పులూ చేసినా, అవి క‌థ‌కు మ‌రింత బలాన్నిస్తే, త‌మ‌న్నా ని మ‌రింత ఎలివేట్ చేస్తే.. క‌చ్చితంగా ఈ రీమేక్ పండుతుంది. అది ఇప్పుడు ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ చేతిలోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close