ధోనీ ఎంట్రీ అదిరింది

సుధీర్ఘ విరామం త‌ర‌వాత‌.. మైదానంలోకి అడుగుపెట్టాడు ధోనీ. బ్యాటుతో.. రాణించే అవ‌కాశం రాలేదు గానీ, వికెట్ల వెనుక చ‌రుకుద‌నంలోనూ, కెప్టెన్సీ నిర్ణ‌యాల‌లోనూ త‌న‌కు ఏమాత్రం తిరుగులేద‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. ఒక్క ఐపీఎల్ త‌ప్ప‌, అన్ని ఫార్మెట్ల‌లోనూ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ధోనీ… ఈ ఐపీఎల్‌లో ఎలా ఆడ‌తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకే ఈ సీజ‌న్‌లో తొలి మ్యాచ్ ముంబై – చెన్నై మ‌ధ్య అనేస‌రికి.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌కి మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. అంద‌రి దృష్టీ ధోనీపైనే.

మైదానంలో ధోనీ తీసుకున్న చాలా నిర్ణ‌యాలు..ఆ జ‌ట్టు విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి. టాస్ గెలిచి.. బౌలింగ్ తీసుకోవ‌డంతో.. ధోనీ ఆట మొద‌లైంది. ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్లు రోహిత్‌, డికాక్‌లు చెల‌రేగిపోతున్న‌ప్పుడు, ప‌వ‌ర్ ప్లేలో ఉండ‌గానే స్పిన్న‌ర్ పీయూష్ చావ్లాని రంగంలోకి దింపాడు ధోనీ. రోహిత్ శ‌ర్మ వికెట్ తీసేముందు… ధోనీ ఫీల్డింగ్‌ని కొద్దిగా మార్చి.. రోహిత్ ని ఊరించాడు. ధోనీ – పీయూష్ ల బుట్ట‌లో.. ప‌డిపోయి వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు రోహిత్‌. ఆ వెంట‌నే డికాక్ వెనుదిరిగాడు. కీల‌క‌మైన స‌మ‌యంలో.. ధోనీ చేసిన బౌలింగ్ మార్పులు మంచి ఫ‌లితాల్ని ఇచ్చాయి. క‌నీసం 180 ప‌రుగులు చేస్తుంద‌నుకున్న ముంబై.. 162 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైపోయింది.

బ్యాటింగ్ ఆర్డ‌ర్ లోనూ ధోనీ మార్పులు చేశాడు. త‌న‌కంటే ముందు జ‌డేజా, కురియ‌న్‌ల‌ను పంపాడు. వాళ్లద్ద‌రూ ఎడ‌మ‌చేతి వాటం బ్యాట్స్‌మెన్ అవ్వ‌డం చెన్నైకి క‌లిసొచ్చింది. కురియ‌న్ రెచ్చిపోయి ఆడ‌డంతో చెన్నై అనుకున్న ల‌క్ష్యాన్ని ముందుగానే పూర్తి చేయ‌గ‌లిగింది. జ‌డేజా స్థానంలో ధోనీ వ‌చ్చుంటే… కావ‌ల్సిన ర‌న్‌రేట్ తో ప‌రుగులు చేయ‌కుంటే త‌ప్ప‌కుండా ధోనీని విమ‌ర్శించేవాళ్లు మ‌ళ్లీ గ‌ళం విప్పేవారు. ధోనీకి వ‌య‌సైపోయింద‌ని, టీ 20కి ప‌నికిరాడ‌ని అనేవారు. కానీ.. ధోనీ వాళ్ల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఆట‌ని ముగించే ఛాన్స్‌… మిగిలిన వాళ్ల‌కు ఇచ్చి, తాను అవ‌త‌లి ఎండ్ లో ఉండిపోయాడు. ధోనీ మాయాజాలం మొద‌టి మ్యాచ్‌లోనే చూసే అవ‌కాశం వ‌చ్చింది. ఇక బ్యాటింగ్ లోనూ రెచ్చిపోవ‌డ‌మే మిగిలివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close