ఎన్నికల్లో ఇక ఈవీఎంలు వాడటం కష్టమేనా..!?

ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని ఓడిపోయిన పార్టీలన్నీ డిమాండ్లు చేస్తూ ఉంటాయి. దాని కోసం కోర్టులకు ఎక్కాయి. ఎక్కడా సానుకూల ఫలితం రాలేదు. కానీ.. ఇప్పుడు కరోనా వారికి ఎలాంటి న్యాయపోరాటం అవసరం లేకుండానే.. బ్యాలెట్ అవకాశం తెచ్చి పెట్టబోతోంది. ఈవీఎంల్లో ఓటు వేయాలంటే పంచ్ చేయాలి. అలా ఒక్కో బూత్‌లో .. ఒక్క ఈవీఎంపై కనీసం వెయ్యి మంది ఒకే చోట టచ్ చేస్తారు. అది వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అవుతుంది. ఒక్క ఓటర్‌కు లక్షణాలు లేని కరోనా వైరస్ ఉన్నా.. ఇతరులకు వ్యాపించడం సులభం. అందుకే.. ఇప్పుడు.. బ్యాలెట్‌పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందుగా.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బ్యాలెట్ వాడే అవకాశం కనిపిస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాశారు. కోవిడ్ కారణంగా బ్యాలెట్ పేపర్, ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబధించి పార్టీల అభిప్రాయం తెలపాలని సూచించారు. ఈనెల 30 లోపు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని లేఖలో ఎస్ఈసీ కోరింది. నిజానికి ఈవీఎంలు వద్దని.. విపక్షాలు కోరుకుంటున్నాయి. కాబట్టి.. కరోనా కారణంగా వచ్చిన అవకాశాన్ని వదిలి పెట్టే అవకాశం లేదు. బ్యాలెట్లే కోరుకుంటాయి. ఇక అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కూడా ఈవీఎంలు కోరుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను.. బ్యాలెట్‌తోనే నిర్వహించారు. తెలంగాణ అధికార, ప్రతిపక్షాలు ఈవీఎంలు వద్దనుకుంటున్నాయి కాబట్టి.. బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది.

ఈవీఎంలతో ఎన్నికలు జరగడం వల్ల.. ఓడిపోయిన వారు.. ఎన్నికల విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్లు వాడుతున్నారు.. టెక్నాలజీపై కనీస అవగాహన ఉండని ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంలో మనకు ఎందుకనే వాదన తీసుకొస్తున్నారు. అయితే.. బ్యాలెట్ విషయంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా పార్టీలు విధానాలను మార్చుకుంటూడటంతో… వారి వాదనలకు మద్దతు లభించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close