గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చు.. అందరూ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు చాలా మందికి మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా పరోక్షంగా చెప్పారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు 99 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒకరిద్దరు కూడా ఉన్నారు.

అయితే.. వీరిలో చాలా మంది దందాలకు దిగి.. ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గతంలో కేటీఆర్ చాలా సార్లు కార్పొరేటర్లను హెచ్చరించారు. మరికొంత మందికి ఎమ్మెల్యేలతో సరిపడే పరిస్థితి లేదు. ఈ కారణంగా.. కేటీఆర్ కొంత మందిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 15 మంది కార్పొరేటర్ల పనితీరు మరీ దారుణంగా ఉందని.. పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆరేళ్లలో గ్రేటర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సలహా ఇస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు తీవ్ర స్థాయిలో చేస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో హడావుడి చేశారు.

అభివృద్ది పనుల్లో వేగాన్ని పెంచారు. మామూలుగా అయితే..వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రేటర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండు, మూడు నెలలు ముందుగా నిర్వహించినా ముందస్తు ఎన్నికలు కావు. ఆరునెలలు ముందుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ఆయన ప్రమోషన్‌కు తిరుగు లేకుండా ఉంటుందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close