వైసీపీ బీసీ నేతలకు పదవుల పండగ..!

ఆంధ్రప్రదేశ్‌లో పదవులన్నీ ఒకే కులానికి కట్ట బెడుతున్నారని వస్తున్న విమర్శల నేపధ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. వాటంతటికి పదవుల పంపకం చేయబోతోంది. బీసీ కార్పొరేషన్లకు ఎవరెవర్ని పదవులకు ఎంపిక చేయాలన్నదానిపై సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సుదీర్ఘమైన కసరత్తు జరిపి.. జాబితా సిద్ధం చేశారు. దాదాపుగా ప్రతీ కులానికి పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలని.. ఈ నలుగురు నేతలు చాలా సమయం వెచ్చించారు. మొత్తంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ చైర్మన్‌ పదవులు, డైరక్టర్ పదవులను ప్రకటించనున్నారు.

29 మహిళలకు, 27 పురుషులకు ఇస్తారు. డైరెక్టర్‌ పదవుల్లోనూ 50 శాతం మహిళలను నామినేట్‌ చేయనున్నారు. ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు కేటాయించబోతున్నారు. సాధారణంగా ఇప్పటి వరకూ బీసీ కార్పొరేషన్ ఉంటుంది. గత ప్రభుత్వం కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతీ బీసీ కులానికి కార్పొరేషన్ పెడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్పొరేషన్లు పెట్టి పార్టీ నేతలకు పదవులను పంపకం చేయబోతున్నారు. అయితే.. నిధులు ఎలా కేటాయిస్తారన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. సాధారణంగా కార్పొరేషన్లు అంటే.. ఆయా కులాల వారు ఉపాధి పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఉంటుంది.

కానీ ఇక్కడ ప్రభుత్వం అలాంటి సాయం ఏమీ చేయడానికి సిద్ధపడటం లేదు. ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేసే మొత్తాన్ని ఏ వర్గానికి ఖర్చుచేస్తున్నారో ఆ మొత్తం.. ఈ కార్పొరేషన్ కింద సాయం చేసినట్లుగా చూపిస్తోంది. అలా చూపించేదానికి కార్పొరేషన్లు ఎందుకన్న చర్చ సహజంగానే వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం కార్పొరేషన్ల ఏర్పాటును మాత్రం ఘనంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కార్పొరేషన్ల వల్ల వైసీపీ నేతలకు పదవులు మాత్రమే దక్కితే ప్రయోజనం ఉండదు.. ఆయా కులాలు ఆర్థికంగా ఎదిగేలా ఉంటేనే ఉపయోగం…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close