కోహ్లీ నుంచి కంగన వరకూ ఆమెకు న్యాయం చేయలన్నారు..! కానీ..

దేశంలోమరో నిర్భయ కన్నుమూసింది. ఢిల్లీ ఘటన కంటే దారుణంగా అత్యాచారానికి గురై మరణించింది. అంత దారుణానికి పాల్పడ్డవారు కనీసం అరెస్ట్ కాలేదు సరి కదా… మరణించిన ఆ నిర్భయను అర్థరాత్రి పూట పోలీసులు దగ్గరుండి దహనం చేయించేశారు. చీకటి పడిన తర్వాత ఎవరూ అంతిమసంస్కారాలు చేయరు. కానీ యూపీ పోలీసులు మాత్రం చనిపోయిన తర్వాత ఆ నిర్భయ మృతదేహాన్ని ఇంటికి కూడా పంపించకుండా నేరుగా కాటికి పంపించేశారు. ఇంటికి తీసుకెళ్తే బంధువులు చివరిచూపు చూస్తారని తల్లిదండ్రులు బ్రతిమిలాడినా పోలీసులు వినలేదు. వినలేదు. నేరుగా స్మశాన వాటికకు తీసుకెళ్లి బలవంతంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.

బాధితురాలిపై అచ్చంగా నిర్భయ తరహాలోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. బస్సులో సామూహిక అత్యాచారం చేసి కిందపడేసి వెళ్లిపోయారు. రాత్రంతా అత్యాచారం చేసి తెల్లవారుఝామున బస్సులో నుంచి బయటకు తోసేశారు. మీరట్‌ నుంచి ఢిల్లీ వెళ్లే రహాదారిలో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరహాలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ రేప్ ఘటనపై విరాట్ కోహ్లీ దగ్గర్నుంచి అందరూ స్పందించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో నిందితులు ఉన్నత కులాలకు చెందిన వారన్న చర్చ నడుస్తోంది. సంఘ విద్రోహ శక్తులను ఉపేక్షించబోమని.. కాల్చి పారేస్తామంటూ యోగి సర్కార్ అదే పనిగా చెప్పుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని.. అత్యాచార బాధితురాలికి అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడమే దీనికి సాక్ష్యమంటున్నారు. దేశం మొత్తం బాబ్రీ గోలలో ఉన్న సమయంలో ఈ యూపీ నిర్భయకు మీడియాలోనూ అన్యాయమే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close