ఏపీలో కంట్రోల్‌లోకి వస్తున్న కరోనా..!

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 3,224 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల పరంగా చూస్తే ఎక్కువే అయినప్పటికీ క్రమంగా తగ్గుతూ రావడం మాత్రం ఏపీలో వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సూచనలు కనిపించడానికి కారణం అంటున్నారు. ప్రస్తుతానిక ఏపీలో ప్రస్తుతం 43,983 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఏడు లక్షల మందికిపైగా రికవర్ అయ్యారు.

దేశంలో ఇప్పటికీఏపీ రెండో స్థానంలో ఉంది. మొత్తం కేసుల్లో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మొదట్లో కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కేరళలో ప్రస్తుతం ఆ వైరస్ విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అన్ లాక్ నిబంధనలు ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్లు తప్ప.. ఎక్కడా నిబంధనలు పెట్టలేదు. నిజానికి కంటెయిన్మెంట్ జోన్లను కూడా పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అయితే సీరో సర్వైలెన్స్ సర్వేల్లో… పాతిక శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని తేలడం.. దేశంలో సగం మందికి యంటీ బాడీస్ ఉన్నాయని అంచనాల నేపధ్యంలో వైరస్‌ను అందరూ తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇక మాస్క్‌లు మాత్రం అందరి జీవితాల్లో భాగం అవుతున్నాయి. ఇక నుంచి ప్రభుత్వాలు టెస్టుల సంఖ్యను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close