నిమ్మగడ్డ పిటిషన్.. ఏపీ సర్కార్ పరేషాన్..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి రోజువారీ ఖర్చులకు కూడా నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నిధులను ఏపీ సర్కార్ నిలిపివేయడంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా పిటిషన్ వేయగానే అలా ప్రభుత్వంలో వణుకు పుట్టింది. వెంనే కూయ 39 లక్షలు విడుదల చేసి.. సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపింది. న్యాయపోరాటం తర్వాత తన ఎస్‌ఈసీ పదవిని తాను పొందిన.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ప్రభుత్వం నుంచి సహకరం అందడం లేదు. ఇప్పుడల్లా ఎన్నికలు నిర్వహించవద్దని.. హైకోర్టులో చెప్పిన ఏపీ సర్కార్… ఎస్‌ఈసీకి ఎలాంటి నిధులు విడుదల చేయడం లేదు.

ఎస్‌ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ. ఆ సంస్థ నిధులు ఆపడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. దీంతో ఎస్‌ఈసీ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మంజూరైన నిధులను కూడా నిలిపివేశారని రమేష్‌కుమార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కె) ప్రకారం నిధులు నిలిపివేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ… పీఆర్‌ ప్రిన్సిపల్ సెక్రటరీలను పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారని తెలిసిన వెంటే ప్రభుత్వం.. రూ.39 లక్షలు విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ లాయర్ ధర్మాసనానికి తెలిపారు. ఏదైనా అవసరం ఉంటే ఎస్‍ఈసీ తమను సంప్రదించాలన్న ప్రభుత్వ లాయర్‌ చెప్పుకొచ్చారు.

ఎస్‍ఈసీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నామన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎస్‍ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. ప్రభుత్వ వైఖరితో.. హైకోర్టును ఆశ్రయించాల్సిరావడం బాధాకరమన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని కూడా పిటిషన్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం అంశాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌తో ఎస్ఈసీ విషయంలో ఏపీ సర్కార్ వైఖరి మరోసారి చర్చనీయాంశమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close