ఢీ 2కి.. అంతా రెడీ!

ఢీ.. మంచు విష్ణుకి దొరికిన తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్. ఆ సినిమాతో శ్రీ‌నువైట్ల ఫామ్ అందుకున్నాడు. విల‌న్ ఇంట్లో హీరో దూరి… బురిడీ కొట్టించ‌డం అనే ఫార్ములాతో హిట్టు కొట్టొచ్చ‌న్న సంగ‌తి ఆ సినిమాతో అర్థ‌మైంది. ఆ త‌ర‌వాత‌.. ఆ త‌ర‌హా స్క్రీన్ ప్లేతో బోలెడ‌న్ని సినిమాలొచ్చాయి. మెల్ల‌మెల్ల‌గా శ్రీ‌నువైట్ల టాప్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు.

అయితే ఇప్పుడు అదంతా గ‌తం. శ్రీ‌నువైట్ల‌ వ‌రుస డిజాస్ట‌ర్లతో.. బాగా వెన‌క‌బ‌డిపోయాడు. మంచు విష్ణుకి సైతం ఓ సాలిడ్ హిట్ అవసరం. అందుకే ఇప్పుడు ఇద్ద‌రూ జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. `ఢీ`కి సీక్వెల్ గా `ఢీ 2` వ‌స్తుంద‌ని చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ లేదు. ఇంత‌కాలానికి ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈనెల 23న `ఢీ` సీక్వెల్ కి సంబంధించిన ఓ ప్ర‌క‌ట‌న బ‌య‌ట‌కు రానుంది. విష్ణు – శ్రీ‌నువైట్ల మ‌రోసారి జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. షూటింగ్ ఎప్పుడు, హీరోయిన్ ఎవ‌రు? అనే విష‌యాల్ని ఆరోజే వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close